Advertisementt

మోహబూబా సెకండ్ సాంగ్ వదిలారు!

Wed 25th Apr 2018 01:06 PM
akash puri,mehbooba,second song,updates  మోహబూబా సెకండ్ సాంగ్ వదిలారు!
Mehbooba Latest Update మోహబూబా సెకండ్ సాంగ్ వదిలారు!
Advertisement
Ads by CJ

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ తన తనయుడు ఆకాష్‌ పూరీని హీరోగా పరిచయం చేస్తూ పూరీ జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌ పతాకంపై నేహాశెట్టి హీరోయిన్‌గా శ్రీమతి లావణ్య సమర్పణలో పూరీ కనెక్ట్స్‌ నిర్మించిన చిత్రం 'మెహబూబా'. 1971లో జరిగిన ఇండో-పాక్‌ యుద్ధ నేపథ్యంలో జరిగే లవ్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు. మే 11న సినిమా విడుద‌ల‌వుతుంది.  ఈ సంద‌ర్భంగా సోమ‌వారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో...

విష్ణురాజు మాట్లాడుతూ - `ఇందులో నేను, ఆకాశ్‌, నేహా కానీ.. అంద‌రూ చేసిన క్యారెక్ట‌ర్స్ చూస్తే వీరు త‌ప్ప మ‌రెవ‌రూ చేయ‌లేర‌నిపిస్తుంది. నాకు అవ‌కాశం ఇచ్చినందుకు థాంక్స్‌. 200 ప‌ర్సెంట్ ఎఫ‌ర్ట్ పెట్టి ప‌నిచేశాను` అన్నారు. 

ఎడిట‌ర్ జునైద్ సిద్ధిఖీ మాట్లాడుతూ - `నేను సినిమా చూసిన‌ప్పుడంతా.. ఆకాశ్ న‌ట‌న న‌న్ను హాంట్ చేసింది. సందీప్ చౌతాగారు అద్భుత‌మైన సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్‌తో సినిమాను 500 రెట్లు పెంచారు` అన్నారు. 

నేహాశెట్టి మాట్లాడుతూ - `హీరోయిన్‌గా అవ‌కాశం ఇచ్చిన పూరీ గారికి, ఛార్మి గారికి, మంచి సంగీతం అందించిన సందీప్ చౌతా గారికి, ఎడిటింగ్ వ‌ర్క్ చేసిన జునైద్‌ గారికి థాంక్స్‌. ఇప్ప‌టికే విడుద‌లైన రెండు సాంగ్స్‌కి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. సినిమా కూడా అంద‌రికీ నచ్చుతుంద‌ని న‌మ్మ‌తున్నాను` అన్నారు. 

ఆకాశ్ పూరి మాట్లాడుతూ - `క‌థ విన్న‌ప్పుడు, షూటింగ్‌కి వెళుతున్న‌ప్పుడు చాలా కాన్ఫిడెంట్‌గా ఉండేవాడిని. సందీప్ చౌతాగారు పంపిన వ‌యోలిన్ ట్యూన్ విన‌గానే మా న‌మ్మ‌కం వంద‌రెట్లు పెరిగాయి. ఇంత మంచి సంగీతాన్ని అందించిన సందీప్‌గారికి, ట్యూన్స్‌కు త‌గిన‌ట్లు లిరిక్స్ ఇచ్చిన భాస్క‌ర‌భ‌ట్ల‌ గారికి థాంక్స్‌. సినిమా మే 11న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. మా నాన్న ఇంత మంచి క‌థ‌ను ఏ హీరోతో అయినా చేయ‌వ‌చ్చు. కానీ నాతో చేయ‌డం ఆనందంగా ఉంది. త‌ప్ప‌కుండా నాన్న‌కు క‌మ్‌బ్యాక్ మూవీ అవుతుంది. ఏ ఫ్యాన్ బేస్‌లేని ఇర‌వైయేళ్ల కుర్రాడినైన నాతో నాన్న క‌మ్‌బ్యాక్ కావ‌డం నాకు గ‌ర్వంగా ఉంది. ప్రేక్ష‌కులు మా ప్ర‌య‌త్నాన్ని ఎంక‌రేజ్ చేయాల‌ని కోరుకుంటున్నాను` అన్నారు. 

ఛార్మి మాట్లాడుతూ - ` మాట ట్రైల‌ర్ చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఆ రెస్పాన్స్ చూసి యూనిట్‌కు ఎంతో ఉత్సాహ‌మేసింది. మా టీమ్‌కు స‌పోర్ట్ చేసిన అంద‌రికీ థాంక్స్‌. రెండు సాంగ్స్ రిలీజ్ చేశాం. ఈ పాట‌ల‌కు కూడా చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. పూరీ గారు, ఆయ‌న సైనికులైన మేము ప‌డ్డ క‌ష్టంతో సినిమా అవుట్‌పుట్ బాగా వ‌చ్చింది. స్క్రీన్‌ప్లే డిఫ‌రెంట్‌గా ఉంటుంది. క్లైమాక్స్ ప్రేక్ష‌కుల‌ను థ్రిల్ చేస్తుంది. సినిమాటోగ్రాఫ‌ర్ విష్ణుశ‌ర్మ‌ గారు, ఎడిట‌ర్ జునైద్‌ గారి క‌ష్టం తెర‌పై క‌న‌ప‌డుతుంది. ప్రస్తుతం రీ రికార్డింగ్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఇన్‌టెన్స్ ల‌వ్‌స్టోరీ. మ్యూజిక్ ప్ర‌ధాన భూమిక పోషించింది. సందీప్‌గారి సంగీతానికి భాస్క‌రభ‌ట్ల‌ గారు అద్భుత‌మైన సాహిత్యాన్ని అందించారు. ఆకాశ్ పూరి, నేహా శెట్టి అద్భుతంగా న‌టించారు. -7 డిగ్రీల చ‌లిలో కూడా చ‌క్క‌గా న‌టించారు. పూరిగారు ఎలాంటి స‌న్నివేశాన్నైనా చాలా ఈజీగా చేస్తే.. ఆకాశ్ ఎంత క‌ష్ట‌మైన స‌న్నివేశాన్నైనా న‌వ్వుతూ చేశారు. టీం అంతా మ‌న‌సు పెట్టి చేసిన సినిమా. మే 11న సినిమా విడుద‌ల కానుంది` అన్నారు. 

పూరి జ‌గ‌న్నాథ్ మాట్లాడుతూ - `చాలా రోజుల త‌ర్వాత జెన్యూన్‌గా ఓ సినిమా చేశాన‌నే ఫీలింగ్ క‌లిగింది. స్క్రిప్ట్ చేసే క్ర‌మంలో క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌ను యాడ్ చేయాల‌ని చాలా సినిమాల‌కు అనుకుంటాను. కానీ జెన్యూన్‌గా అలాంటి ఆలోచ‌న‌లు లేకుండా చేసిన సినిమా మెహ‌బూబా.  ఇక హీరో ఆకాశ్ గురించి చెప్పాలి(న‌వ్వుతూ...) ...ఆకాశ్ చిన్న‌ప్ప‌ట్నుంచి మా ఇంట్లోనే ఉండేవాడు. నాలుగైదేళ్ళ‌కు నా క‌ళ్ల ముందు నిల‌బ‌డి చిరంజీవి గారు, బాల‌కృష్ణ‌ గారు.. ఇలా హీరోల డైలాగ్స్ చెప్పి ఓ వేషం అని అడిగేవాడు. వీడి టార్చ‌ర్ త‌ట్టుకోలేక చిరుత‌లో వేషం ఇచ్చాను. త‌ర్వాత పోకిరిలో న‌టించాడు. ఆ స‌మ‌యంలో మ‌హేశ్‌, ప‌దేళ్ల కుర్రాడు(ఆకాశ్‌)పై ఓ క‌థ‌ను రాసుకున్నాడు. ఈ క‌థ చెబితే మ‌హేశ్ తంతాడు అని చెప్పాను. అప్పుడు .. నువ్వు హీరో కావ‌డానికి ప‌దేళ్ల స‌మ‌యం ప‌ట్టొచ్చు. ఆ స‌మ‌యానికి నేను నీతో సినిమా చేసే స్థితిలో ఉండొచ్చు , లేక‌పోవ‌చ్చు. కాబ‌ట్టి నీ ప్ర‌య‌త్నాలు నువ్వు చేసుకో అని నేను త‌న‌కి చెప్పాను. అప్ప‌టి నుండి ఇంటికి ఎవ‌రు వ‌చ్చినా కాకా ప‌ట్టుకునేవాడు. టైమ్ బావుంది. నేనే సినిమా చేశాను. దిల్‌రాజు గారు సినిమా చూసి నీ కెరీర్‌లో బెస్ట్ ఫిల్మ్ భ‌య్యా అన్నారు. దిల్‌రాజు గారు సినిమాను రిలీజ్ చేస్తున్నాడ‌న‌గానే చాలా మంది నాకు ఫోన్ చేసి అప్రిషియేట్ చేశారు. సందీప్ చౌతాతో నేను చేసిన మూడో సినిమా. అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చాడు. నా త‌మ్మ‌డు భాస్క‌ర‌భ‌ట్ల ఏదో ప‌గ‌బ‌ట్టిన‌ట్లు పాట‌లు రాశాడు. త‌న‌కు థాంక్స్‌. విష్ణుశ‌ర్మ‌, జునైద్‌, అనిల్, జానీ, స‌తీశ్ ఇలా సినిమాకు ప‌నిచేసిన అంద‌రూ మ‌న‌సు పెట్టి ప‌నిచేశారు. ఛార్మికి స్పెష‌ల్ థాంక్స్‌. త‌ను మ‌గాళ్ల కంటే ఎక్కువ‌గా ప‌నిచేస్తుంది. అందుకే త‌నంటే నాకు ఇష్టం. ఉత్తేజ్ స‌హ‌కారంతో ఆకాశ్‌, నేహాశెట్టి ఏ సీన్ ఎలా చేయాలో ముందుగానే నేర్చుకుని చేసేవారు. ఉత్తేజ్‌కి కూడా థాంక్స్‌. మే 11న సినిమా విడుద‌ల‌వుతుంది. వ‌చ్చే ప‌దేళ్ల‌లో వీడు కంటే మంచి సినిమాలు నేను చేస్తాను. ఇట్స్ మై ఛాలెంజ్‌` అన్నారు. 

Mehbooba Latest Update:

Mehbooba Second Song Released    

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ