దమ్ముంటే దైర్యం ఉంటే కాస్టింగ్‌కౌచ్‌కి పాల్పడిన వారి పేర్లను ధైర్యంగా ప్రకటించాలి. లేదా మౌనంగా అనుభవించాలి. అంతేగానీ ఎవరో అన్నారు.. మేము విన్నాం... మాకు మాత్రం అలాంటి ఘటనలు ఎదురవ్వలేదు గానీ పలువురు చెబితే మాకు కూడా ఇది ఉందని తెలిసింది... అలాంటి వారిని వెలివేయాలి.. అన్ని విషయాలను జనరలైజ్ చేసి మాట్లాడి, ఇద్దరు ముగ్గురు చేసిన చెత్త పనికి ఇండస్ట్రీ మొత్తాన్ని నిందించి, అనుమానించేలా చేయడం సరికాదు.
ఈ విషయంపై ఇప్పటికే తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ ఓ ప్రకటన కూడా చేశాడు. వరలక్ష్మి శరత్‌కుమార్, అమలాపాల్ విషయంలో ఇలా జరిగితే తీవ్ర చర్యలు తీసుకున్నామని, మహిళలు నేరుగా ఫిర్యాదు చేసి ఫలానా వారు అని స్పష్టంగా చెప్పాలే గానీ అందరు అలాగే అనే అనుమానాలు వచ్చేలా మాట్లాడవద్దని సూచించాడు. కానీ తాజాగా తమిళ నటి రమ్యనంబీశన్ ఈ విషయంలో మరోసారి అలాగే స్పందించింది. 'పిజ్జా, సేతుపతి' సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె తాజాగా ప్రభుదేవా 'మెర్క్యురీ'లో కూడా నటించింది.
ఈమె మాట్లాడుతూ, ఇండస్ట్రీలో కాస్టింగ్‌కౌచ్ సంప్రదాయం ఉంది. చిత్ర పరిశ్రమలో మహిళలు లైంగిక వేధింపులకు దిగడం నిజమేనని తెలిపింది. కాస్టింగ్‌కౌచ్ అనే పదం వేరైనా కూడా ఇది అన్ని రంగాలలో ఉంది. సినిమాలలో అవకాశాల కోసం సెక్స్‌వల్ ఫేవర్ ఆశిస్తారు. ఈ పరిస్థితి నాకు ఎదురు కాకపోయినా తోటి సహనటులు చెబుతుంటే విన్నాను. ఇలాంటి వాటిని అడ్డుకోవాలని, ఈ విషయంలో మహిళలు ధైర్యంగా పోరాడాలని రమ్యనంబీశన్ పిలుపునిచ్చింది.