మొత్తానికి శ్రీరెడ్డి ద్వారా మొదలైన కాస్టింగ్‌కౌచ్ వివాదం పలు మలుపులు తిరిగి. శ్రీరెడ్డికి తానే ఆ సలహా ఇచ్చానని వర్మ చెప్పడం, ఇక పవన్ వర్సెస్ వర్మగా ఇది మారడం, ఆ తర్వాత పవన్ ఎంట్రీతో దీనికి పవన్ వర్సెస్ మీడియా రంగు పులుముకుంటూ కొత్త కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ సందర్భంగా మీడియా అధినేతలపైనే తన పోరు అని, కానీ తనకు జర్నలిస్ట్‌లకు మధ్య బేధాభిప్రాయలు, వ్యక్తిగత కక్ష్యలు లేవని పవన్ స్పష్టం చేశాడు. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ్డ పద్మనాభం ఇప్పుడు దీనిని కాపు వర్సెస్ మీడియా, కాపు వర్సెస్ తెలుగుదేశంగా మార్చడానికి అగ్గిని బాగానే రాజేశాడు.
తాజాగా ఆయన పవన్‌కి సుదీర్ఘమైన ఉత్తరం రాశాడు. కిందటి ఎన్నికల్లో మీ పుణ్యాన కాపుల ఓట్లు సాధించి పీఠం ఎక్కిన చంద్రబాబు తర్వాత ఒక్కో వర్గాన్ని అణగదొక్కుతున్నాడు. మొదటి దళితులను టార్గెట్ చేశాడు. ఆ తర్వాత ఇచ్చిన హామీలను కాపులకు అమలు పరచమని దీక్ష చేసిన తనని, తన భార్య, కోడలిని జుట్టుపట్టి లాక్కోచ్చాడు. నిన్నటి వరకు మీరు చంద్రబాబుని అపరమేధావి, పరిపాలనాధ్యక్షుడు, అనుభవశాలి అని బాగా మోసారు. కానీ నేడు టిడిపి, చంద్రబాబు మీడియా ద్వారా, తమకి అనుకూలమైన మీడియా అధినేతలు, నాయకుల ద్వారా మిమ్మల్ని కూడా అసభ్య పదజాలంతో టార్గెట్ చేస్తున్నారు.
కాబట్టి ఇప్పటికైనా తెలుసుకుని చంద్రబాబుని, టిడిపిని సముద్రంలో కలిపేంత వరకు మీరు విశ్రమించవద్దు. మీ తల్లిని అన్న మాటలను పక్కన పెట్టి టిడిపిని సముద్రంలో కలపండి.. నేను కాపులకు రిజర్వేషన్ల మీద ఆందోళన చేసినప్పుడు చిరంజీవి, దాసరి వంటి వారు మద్దతు ఇచ్చారు. ఇక పవన్ టిడిపి అంతుని చూడాలని మధ్యలో ముద్రగడ కాలుతున్న మంటలో బీడీ కాల్చుకునే పని చేస్తున్నాడు...!