మీడియాపై జనసేనాని పవన్ చేపట్టిన యుద్దంలో పవన్‌కి సలహాలు ఎవరిస్తున్నారో గానీ ఐదేళ్ల కిందట జరిగిన రవిప్రకాష్‌పై ఉద్యోగి బూటు విసరడం వీడియోను పోస్ట్ చేశాడు. ఇది జరిగి ఎంతో కాలమైందని, ఇది నాడు బాగా సర్క్యులేట్ అయిన విషయమేనని వర్మ సెటైర్ వేసే దాకా పవన్ తన తెలివిని చూసి అందరు వింతగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. మీడియాపై, శ్రీనిరాజు, రవిప్రకాష్, వేమూరి రాధాకృష్ణ వంటి మీడియా నేతలపై ఆయన చేస్తున్న వరుస ట్వీట్స్ చూస్తే పవన్ చేస్తున్న ఈ మీడియా వ్యతిరేక ఉద్యమంలో సీరియస్‌నెస్ కనిపించడం లేదు. ఉదయం నుంచి ఘాటుగా ట్వీట్స్ చేయడంతో పవన్‌కి ఆయా మీడియా అధినేతలకి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన, ఎవరికి తెలియని అంశాలను బయట పెడతాడేమో అని అందరు ఎదురుచూస్తున్న నేపధ్యంలో పవన్ సాయంత్రానికల్లా మాట మార్చేశాడు. ఏబీఎన్ వాహనాలపై పవన్ అభిమానులు చేసిన దాడులకు సంబంధించి బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైన సందర్భాన్ని పవన్ ఉటంకిస్తూ, ఆర్కే, మీ దూషణలను మేము భరిస్తాం. వాట్ టు డూ? మేము సాత్వికం. పైగా పవర్‌లెస్, మేము బాధపడతాం... అని పవన్ ట్వీట్ చూస్తే సింహంలా గర్జిస్తాడనుకున్న పవన్ ఆర్కేని బలవంతునిగా ఒప్పుకుంటూ ట్వీట్ చేయడంతో ఆ సీరియస్ నెస్ తగ్గింది.
టీడీపీ జ్యోతిరత్న ఆర్కే, టీడీపీ సంస్కృతి ఏంటి? ప్రధాన మంత్రి నుంచి సామాన్యుల వరకు అందరినీ దూషించడమా? మంచి ట్రైనింగ్, కీపిటప్... ప్రత్యేక హోదా సాధించేందుకు టిడిపి వద్ద మంచి వ్యూహం ఉంది. అత్యంత అసభ్య పదజాలంతో ప్రధానమంత్రిని తిట్టమని మీకు ఎవరు సలహా ఇచ్చారు. ఖచ్చితంగా ఈ సలహా ఇచ్చింది ఆర్కేనే అని ట్వీట్ చేశాడు. ఇక ప్రతి ఆదివారం ఆంధ్రజ్యోతిలో కొత్త పలుకు పేరుతో ఆర్టికల్స్ రాసే వేమూరి రాధాకృష్ణ ఈ ఆదివారం స్పెషల్ ఫోకస్ పవన్‌పై పెట్టాడు. పవన్ చేసిన 'కాటమరాయుడు'ని ఉద్దేశించి 'ట్వీటమరాయుడు' అని ఎద్దేవా చేశాడు. అసలు పవన్‌కి, చంద్రబాబుకి గొడవ జరిగితే పవన్ నన్ను ఎందుకు దీనిలోకి లాగుతున్నాడు. పవన్‌ని ఎంతో ఉన్నతంగా ఊహించుకున్నాను. ఆయన మాజీ భార్య రేణూదేశాయ్‌ని బూతులు తిడితే పట్టించుకోని పవన్ తన తల్లిని మేమేమీ అనకపోయినా కూడా దానిని తన రాజకీయాలకు వాడుకుంటున్నాడు.
పీకే పెట్టిన ఆ వీడియోని ఆంధ్రజ్యోతి అసలు ప్రసారం చేయలేదు. సమస్య వస్తే పోలీస్‌స్టేషన్‌కి వెళ్లాలని సలహా ఇచ్చిన పవన్ మాటలను నేను కూడా సపోర్ట్ చేశాను. అలా చెప్పిన నా మీద పవన్ బురద జల్లుతున్నాడు. కాస్టింగ్ కౌచ్ సినిమా రంగంలోనే కాదు..అన్ని రంగాలలో ఉందని చెప్పి, సినిమా పరిశ్రమను మాత్రమే లోకువ చేయద్దు అని చెప్పిన నన్ను ఇలాంటి విషయంలోకి లాగడం సరికాదు. రెచ్చిపోవడానికి మనుషులు ఉన్నారని మీడియా మీద దాడిచేస్తే అది బలం కాదు. బలహానత అని పవన్ గుర్తుంచుకోవాలి. వర్మకి పవన్‌కి మధ్య ఏవో ఉంటే వాటిని మాకు పవన్ అంటించడం సరికాదని వేమూరి ఆగ్రహం వెలిబుచ్చాడు.