ఈ ఏడాది సంక్రాంతి సీజన్ తెలుగు ఇండస్ట్రీకి కలిసి రాకపోయినా ఆ తర్వాత రిపబ్లిక్‌డే కానుకగా వచ్చిన అనుష్క 'భాగమతి', నాగశౌర్య 'ఛలో', వరుణ్‌తేజ్ 'తొలి ప్రేమ' వంటి వాటితో గాడిలో పడింది. ఇక ఇటీవల వచ్చిన రామ్‌చరణ్ చిత్రం 'రంగస్థలం' ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టింది. ఈచిత్రం ఇండస్ట్రీ హిట్‌గా రికార్డులను కొల్లగొట్టగా కేవలం రెండు వారాల వ్యవధిలోనే 'భరత్ అనే నేను'తో ఇప్పుడు సూపర్‌స్టార్ మహేష్‌బాబు ఆ రికార్డులను సరిచేసే పనిలో ఉన్నాడు. ఇక 'రంగస్థలం' ద్వారా సుకుమార్ తానేంటో నిరూపించుకుంటే ఇక కొరటాల శివ 'మిర్చి, శ్రీమంతుడు, జనతాగ్యారేజ్' ల తర్వాత మరోసారి సోషల్ ఎలిమెంట్స్‌కి కమర్షియల్ టచ్ ఇచ్చి బ్లాక్‌బస్టర్స్ కొట్టడంలో తనకు తిరుగేలేదని నిరూపించుకున్నాడు. ఇక 'రంగస్థలం, భరత్ అనే నేను'లలో హీరోలైన రామ్‌చరణ్, మహేష్‌బాబుల పాత్ర ఎంతో సుకుమార్, కొరటాల శివ ప్రతిభ కూడా అంతే కారణంగా చెప్పుకోవాలి. ఓ చిత్రానికి దర్శకుడు కెప్టెన్‌గా ఎలా అవుతాడో వీరిద్దరు తాజాగా నిరూపించి, బ్లాక్‌బస్టర్స్‌లో తమ వంతు పాత్రను పోషించారు.
ఇక 'రంగస్థలం' చిత్రం సమయంలో మీడియా అటెన్షన్ అంతా ఆ చిత్రం పైనే ఉంది. పైగా ఇది వేసవికి సెలవులను మొదలు పెట్టిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. కానీ అదే 'భరత్ అనే నేను' విషయానికి వస్తే ఈ చిత్రం రిలీజ్ రోజున మీడియా అంతా చంద్రబాబు చేపట్టిన ధర్మదీక్ష, పవన్ కళ్యాణ్ వ్యవహారం వల్ల మీడియా అటెన్షన్ కాస్త దారి మరలింది. కానీ సినిమాలో కంటెంట్ ఉంటే ఎవ్వరూ ఏమి చేయలేరని నిరూపిస్తూ 'భరత్ అనేనేను' మహేష్ కెరీర్‌లోనే పెద్ద హిట్‌గానే కాకుండా ఇండస్ట్రీ హిట్టుగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే రాజమౌళితో పాటు పలువురి ప్రశంసలు పొందిన ఈచిత్రంపై ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుకకు ముఖ్య అతిధిగా హాజరై, స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రశంసల వర్షం కురిపించాడు. సోషల్ మెసేజ్‌ని ఇస్తూనే కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా బ్యాలన్స్ చేయడం అంత సులభం కాదని, కానీ దానిని కొరటాల శివ సాధ్యం చేశాడని ఆయన ప్రశసించారు. ఇక గతంలో కొరటాల ఎన్టీఆర్ నటించిన 'జనతాగ్యారేజ్'ని కూడా సోషల్ మెసేజ్‌ని ఇస్తూనే ఎన్టీఆర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ని అందించిన సంగతి తెలిసిందే.
ఈ చిత్రంలో అద్భుతంగా నటించిన మహేష్‌కి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రాన్ని తీసిన యూనిట్‌కి శుభాకాంక్షలు అని ఎన్టీఆర్ తెలిపాడు. ఇక మహేష్ తన 25 వ చిత్రం వంశీ పైడిపల్లితో చేసిన అనంతరం ఆయన 26వ చిత్రంగా మైత్రీమూవీస్ బేనర్‌లోనే సుకుమార్‌తో మహేష్ చేయనున్నాడు. ఇక ఈ విజయం వెనుక తన శ్రీమతి నమ్రతా సపోర్ట్ కూడా ఉందని చెప్పిన మహేష్, నమ్రతాకి గాఢమైన లిప్‌లాక్ ఇస్తున్న ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది....!