స్టోరీ రైటర్ గా ఉన్న కొరటాల శివ డైరెక్షన్ లోకి దిగాడు. దర్శకత్వంలోకి దిగిన వెంటనే స్టార్ హీరో ప్రభాస్ తో 'మిర్చి' తీశాడు. తర్వాత కూడా మహేష్ బాబు అంతటి స్టార్ హీరో తో 'శ్రీమంతుడు' చేశాడు. ఆ తరవాత ఎన్టీఆర్ తో 'జనతా గ్యారేజ్' చేశాడు. మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. కొరటాల ఎందుకు ఎప్పుడూ స్టార్ హీరోల వెంటే పడతాడు..... కానీ యంగ్ హీరోలతోనూ, చిన్న హీరోలతోనూ సినిమాలు చెయ్యడు అనే టాక్ ఉంది. అయినా కొరటాల మళ్ళి మహేష్ బాబునే పట్టాడు. మహేష్ బాబుతో కలిసి 'భరత్ అనే నేను' సినిమా చేసి హిట్ కొట్టాడు. ఇక 'జనతా గ్యారేజ్' తర్వాతే రామ్ చరణ్ తో సినిమా అన్నారు కానీ. తాజాగా మహేష్ 'భరత్ అనే నేను' తర్వాత రామ్ చరణ్ తోనే కొరటాల మరో సినిమా చేస్తాడంటున్నారు.
కాదు కాదు కొరటాల శివే చెబుతున్నాడు... తన నెక్స్ట్ మూవీ రామ్ చరణ్ తో అని. మరి ఇలా వరసగా స్టార్ హీరోలతోనే సినిమాలు చేస్తున్న కొరటాల శివ మిగతా వారిని చిన్న చూపు చూస్తున్నట్లే లెక్క. అయన కేవలం స్టార్ హీరోలను దృష్టిలో ఉంచుకునే కథలు రాసుకుంటున్నాడా? కేవలం స్టార్ హీరోలతోనే సినిమా చేస్తాడా? అంటూ చాలామంది యంగ్ హీరోలు మనసులో అనుకుంటున్నారు. తమకి కొరటాలతో సినిమా చెయ్యాలని ఉన్నా కూడా కొరటాల తమతో ఎందుకు సినిమా చేస్తాడు... కేవలం స్టార్ హీరోలతో తప్ప అన్నట్టుగా సన్నిహితుల దగ్గర వాపోతున్నారట.
మరి ప్రస్తుతం 'భరత్ అనే నేను' తో హిట్ కొట్టిన కొరటాల శివ, రామ్ చరణ్ రెండు సినిమాలు పూర్తయ్యే వరకు ఎదురు చూస్తాడా.? ఎందుకంటే రామ్ చరణ్ ఒకటి బోయపాటి సినిమా పూర్తి చెయ్యాలి. అలాగే రాజమౌళి మల్టీస్టారర్ లోను నటించాల్సి ఉంది. ఇక బోయపాటికి కేవలం 6 నెలల టైం ఇస్తే సరిపోతుంది. కానీ రాజమౌళి సినిమాకి ఎంత టైం పడుతుంది అనేది హీరోలు కూడా చెప్పలేని పరిస్థితి. మరి కొరటాల అప్పటివరకు వెయిట్ చేస్తాడా? లేదంటే అనేది ప్రస్తుతానికి మాత్రం ఫుల్ సస్పెన్సు.