Advertisementt

'సాహో' గురించి సంచలన వార్త..!

Tue 24th Apr 2018 12:23 AM
prabhas,saaho movie,backdrop,revealed  'సాహో' గురించి సంచలన వార్త..!
Saaho Backdrop Revealed! 'సాహో' గురించి సంచలన వార్త..!
Advertisement
Ads by CJ

బాహుబలి తర్వాత మళ్ళీ అంతటి భారీ బడ్జెట్ తో క్రేజ్ తో తెరకెక్కుతున్న సినిమా 'సాహో'. కేవలం 'రన్ రాజా రన్' వంటి ఫన్నీ సినిమా చేసిన సుజిత్ కి ఇంతపెద్ద బాధ్యతలు అప్పజెప్పాడు హీరో ప్రభాస్. 'బాహుబలి' తర్వాత తన క్రేజ్ ఏమాత్రం తగ్గకుండా ఉండేందుకే ప్రభాస్ ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఇక ప్రభాస్ ఫ్రెండ్స్ కూడా ప్రభాస్ రేంజ్ కి ఏ మాత్రం తగ్గకుండా ఈ 'సాహో' చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. కేవలం యాక్షన్ సీన్స్ కే దుబాయ్ లోను అబుదాబి లో 50 కోట్లు ఖర్చు పెట్టి మరి ఒక కారు ఛేజింగ్  సీన్స్ ని ప్లాన్ చేసారంటే 'సాహో' సినిమా ఎలా తెరకెక్కుతుందో అర్ధమవుతుంది.

అయితే 'బాహుబలి' వంటి హిట్ కొట్టిన ప్రభాస్ 'సాహో' తో మళ్ళీ ఎలాంటి మూవీ చెయ్యబోతున్నాడో.. అది ఎలాంటి బ్యాగ్ డ్రాప్ లో ఉండబోతుందో అనే క్యూరియాసిటీ అటు ప్రభాస్ ఫ్యాన్స్ లోను ఇటు ప్రేక్షకుల్లోనూ ఉంది. అయితే 'సాహో' సినిమా దేశంలోని పలు భాషల్లో తెరకెక్కడం, సినిమా మీదున్న భారీ అంచనాలు చూస్తుంటే 'సాహో' సినిమా మీద భారీగా హైప్ క్రియేట్ అయ్యింది. అయితే 'సాహో' సినిమా బ్యాగ్ డ్రాప్ ఏంటనే విషయమై ఒక చిన్న క్లూ బయటికి  వచ్చింది.

'సాహో' సినిమా కథ సోషల్ మెస్సేజ్ తో పాటు ఒక రివేంజ్ డ్రామాగా కూడా ఉండబోతోందట. ఈ రివేంజ్ డ్రామా కోసమే 'సాహో' టీమ్ భారీ యాక్షన్ సీన్స్ ని ప్లాన్ చేసిందట. మరి అందుకే దుబాయ్ వంటి మహా నగరంలో 50 కోట్లతో 50 రోజుల పాటు ఒక భారీ షెడ్యూల్ ప్లాన్ చేసి మరి భారీ యాక్షన్ సీన్స్ ని హాలీవుడ్  స్టంట్ మాస్టర్ ఆధ్వర్యంలో చేస్తున్నారు. ఇక ఈ యాక్షన్ సన్నివేశాల్లో ప్రభాస్ డూప్ లేకుండా కష్టపడుతున్నట్లుగా సమాచారం. ఇక ఈ యాక్షన్ సన్నివేశాల కోసం 'సాహో' విలన్ నీల్ నితిన్ కూడా దుబాయ్ ఫ్లైట్ ఎక్కేశాడు. బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ద కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో చాలా వరకు బాలీవుడ్ నటీనటులే కనబడనున్నారు.

Saaho Backdrop Revealed!:

Speculation on Saaho backdrop

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ