Advertisementt

పవన్ కళ్యాణ్ నెంబర్ వన్ హీరో: అల్లు అర్జున్!

Tue 24th Apr 2018 12:18 AM
allu arjun,pawan kalyan,naa peru surya,audio  పవన్ కళ్యాణ్ నెంబర్ వన్ హీరో: అల్లు అర్జున్!
Allu Arjun Support to Pawan @ NPS Audio పవన్ కళ్యాణ్ నెంబర్ వన్ హీరో: అల్లు అర్జున్!
Advertisement
Ads by CJ

గత నాలుగు రోజులుగా మెగా హీరోలంతా ఒక్కటే అన్నట్టుగా ఉంది ఇండస్ట్రీలోని యవ్వారం. గత కొన్నాళ్లుగా మెగా హీరోలలో అందరిదీ ఒక ఎత్తయితే నాదో ఎత్తు అన్నట్టుగా మెగా హీరో అల్లు అర్జున్ ఉంటున్నాడు. పవన్ కళ్యాణ్ విషయంలో మెగా హీరోలకు చెప్పను బ్రదర్ అంటూ కామెంట్ చేసి మెగా ఫ్యాన్స్ లో పవన్ ఫ్యాన్స్ కి యాంటీ అయ్యాడు అల్లు అర్జున్. తర్వాత పవన్ కి అల్లు అర్జున్ కి మరింత దూరం పెరిగింది. ఇక ఈ దూరానికి ఫుల్ స్టాప్ పెడుతూ పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లు ఇద్దరు ఫిల్మ్ ఛాంబర్ లో మెగా ఫ్యాన్స్ సాక్షిగా హాగ్ చేసుకుని తమ మధ్యన దూరం లేదని క్లారిటీ  ఇచ్చేశారు. ఇక మెగా ఫ్యాన్స్ కూడా అందరూ కలిసిపోయి పండగ చేసుకుండ్రు.

అయితే అదే పండగని అల్లు అర్జున్ మరోమారు కొనసాగించాడు. అదెక్కడా అంటే ఆదివారం సాయంత్రం ప.గో. జిల్లాలోని మిలట్రీ మాధవరంలో 'నా పేరు సూర్య' ఆడియో లాంచ్ వేడుక మెగా అభిమానుల సమక్షంలో జరిగింది. ఆ ఫంక్షన్ లో మెగా హీరోలంతా ఒకటే అని అన్నాడు అల్లు అర్జున్. ఇంకా అల్లు అర్జున్ ఈ ఆడియో వేడుకలో మాట్లాడుతూ.. ఈ రోజు నేను పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే ఇక్కడి నుండి వెళతానని... మాములుగా నాకు ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడాలంటే.. నాకు బాగా మాట్లాడాలని అనిపించాలి. పవన్ కళ్యాణ్ గారు నెంబర్ వన్ హీరో. మరి నెంబర్ వన్ హీరోగా ఆయన  ఏసీ రూమ్‌లలో కూర్చొని హాయిగా బతకొచ్చు. కానీ ఆయన తన సుఖాలనన్నింటిని వదిలేసి జనంలోకి జనం కోసం ఎండలోకి వచ్చాడు.

కొంతమంది హీరోలుగా తమ కెరీర్ ముగుస్తుంది అనుకున్నప్పుడే రాజకీయాల్లోకి వస్తారు. కానీ పవన్ గారు నెంబర్ వన్ హీరోగా ఉన్నప్పుడే రాజకీయాల్లోకి వచ్చారు. కానీ కొంతమంది ఆయన మీద వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారు. గతంలో చిరు గారి మీద కూడా ఇలాంటి విమర్శలు చేశారు. టివి ఛానల్స్ లో కూర్చుని వ్యక్తిగత విమర్శలు చెయ్యడం... వాటిని పదే పదే చూపించడం అనేది అస్సలు బాగోలేదు. అలా చూపించి ఇబ్బంది పెట్టడమనేది నాకస్సలు నచ్చలేదంటూ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ పవన్ కల్యాణికి డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నాడు . ఇక ఈ దెబ్బకి మెగా హీరోల్లో ఐక్యత... నా పేరు సూర్య కి మంచి జరిగి తీరుతుంది.

Allu Arjun Support to Pawan @ NPS Audio:

Allu Arjun Furious Over Media and Pawan Abusers

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ