'బాహుబలి' కోసం ఏకంగా ఐదేళ్లు కేటాయించిన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నేడు జాతీయ, అంతర్జాతీయ సెలబ్రిటీగా మారిపోయాడు. యూత్‌కి ఐకాన్‌గా మారిపోయాడు. ఆయన క్రేజ్ దేశంలో ఎలా ఉందో హీరో నిఖిల్ తాజాగా చెప్పాడు. నిఖిల్ తాజాగా 'ముద్ర' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఠాగూర్ మధు నిర్మాణంలో సంతోష్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలోని ఓ పాటను గంగోత్రి జలపాతం వద్ద తీయడానికి ఈ యూనిట్ వెళ్లిందట. కానీ అక్కడి మిలటరీ వారు వారి షూటింగ్‌కి నో చెప్పారు. కానీ నిఖిల్ వారిని కన్విన్స్ చేస్తూ హైదరాబాద్ నుంచి వచ్చాం సార్ అనగానే వారు వెంటనే అంటే ప్రభాస్ సొంత ఊరు నుంచి వచ్చారా? అంటూ షూటింగ్‌కి అనుమతులు ఇవ్వడమే కాదు.. వీరికి వాటర్ బాటిల్స్, ఫుడ్ కూడా అందించారట. దేశంలో ప్రభాస్‌కి ఉన్న క్రేజ్‌కి ఇది ఒక ఉదాహరణ మాత్రమే.
ఇక ప్రభాస్ ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఒకేసారి నిర్మితవుతున్న 'సాహో' చిత్రాన్ని దుబాయ్‌లోని అబుదాబిలో ప్లాన్ చేశారు. అనుమతులు ఆలస్యం కావడంతో ప్రభాస్ రెస్ట్ మూడ్‌కి వెళ్లాడు. ఇప్పుడు మాత్రం ఆయన అబుదాబి షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఇక్కడి ప్రపంచ ప్రఖ్యాత కట్టడం బూర్జ్ కలీఫా చుట్టు ఈ యాక్షన్ సీన్ ఉంటుంది. ప్రభాస్‌తో పాటు విలన్ నీల్ నితేష్‌లతో పాటు కొందరు ఫైటర్స్‌పై ఈ సీన్స్‌ని చిత్రీకరించనున్నారు. ఈ సినిమాకి హైలైట్ అనిపించేలా ఉండే ఈ ఒక్క యాక్షన్ ఎపిసోడ్ కోసం యూనిట్ ఏకంగా 30కోట్లు ఖర్చు పెడుతోంది. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ కెన్నీగేట్స్ ఈ యాక్షన్ ఎపిసోడ్‌ని డిజైన్ చేశాడు.
ఇక ఈ చిత్రంలో సంగీత దర్శకులైన శంకర్ -ఎహసాన్-లాయ్‌ల నుంచి ఇందులో నటించే హీరోయిన్లు, విలన్లు అందరు దాదాపు బాలీవుడ్ వారే. ఇక తాజాగా ఈ టీమ్‌లోకి ఎవలిన్ శర్మ కూడా చేరింది. 2019లో విడుదలయ్యే మోస్ట్ ఎవైటెడ్ మూవీగా 'సాహో'నే చెప్పుకోవాలి. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి లేదా వచ్చే సమ్మర్‌ని గానీ టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఇక అబుదాబిలో కారు చేజింగ్ సీన్స్ కోసం యూఎస్‌ల నుంచి పలుకార్లను కొనుగోలు చేశారు. ఈయాక్షన్ ఎపిసోడ్స్‌లో సహజత్వం కోసం ప్రభాస్ డూప్ లేకుండా తానే సొంతంగా ఈ యాక్షన్ సీన్స్‌ని చేయనున్నాడు. మొత్తానికి ఈ చిత్రంతో ప్రభాస్ తన రేంజ్‌ని మరోసారి నిరూపిస్తాడా? లేదా? అనేది వేచిచూడాల్సివుంది...!