మొదటిరోజు ముప్పై కోట్లు షేర్ తో బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ క్రియేట్ చేస్తూ సెన్సేషన్స్ సృష్టిస్తుంది భరత్ అనే నేను. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో తెలుగు రాష్ట్రాల్లో ప్రతి షో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ఆదివారం కూడా వసూళ్లలో డ్రాప్ అవ్వకుండా దూసుకుపోతుంది 'భరత్ అనే నేను'.
అయితే 'భరత్ అనే నేను'కి అసలు పరీక్ష సోమవారం నుండి మొదలవుతుంది. ఈ సినిమాకు రిపీట్ ఆడియన్స్ ఉన్నారా లేదా వీక్‌డేస్‌లో సస్టెయిన్ అవుతుందా అనేది సోమ, మంగళ వారాల్లో తెలుస్తుంది. అయితే అల్లు అర్జున్ 'నా పేరు సూర్య' సినిమా వచ్చే వరకు భరత్ అనే నేనుకి ఏమి డోకా లేదు.
మే డే రోజు హాలిడే రావడంతో ఈ సినిమాకు మరింత ప్లస్ కానుంది. రెండు వారాలు తిరిగే లోగా 'రంగస్థలం' మాదిరిగా వంద కోట్ల షేర్ క్లబ్‌లోకి చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రాన్ని అమ్మిన రేట్లకి వంద కోట్లకి పైగా షేర్ వస్తేనే హిట్ కింద లెక్క. ప్రస్తుతం ఆ దిశగానే వెళుతోందీ సినిమా.