'బ్రహ్మూెత్సవం, స్పైడర్' వంటి డిజాస్టర్స్ తర్వాత మహేష్‌బాబు నటించిన 'భరత్ అనే నేను'కి మంచి పాజిటివ్ టాకే వచ్చింది. అందరు మూడు పాయింట్ల రేటింగ్స్ ఇస్తున్నారు. దీంతో ఈ వేసవి సెలవుల్లో 'నా పేరు సూర్య...నా ఇల్లు ఇండియా' వచ్చేలోపు కలెక్షన్లు కొల్లగొట్టడం 'భరత్ అనే నేను' పని. మధ్యలో 27వ తేదీ 'కాలా' వచ్చి ఉంటే పరిస్థితి కాస్త భిన్నంగా ఉండేది. కానీ 'కాలా'ని సమ్మెవల్ల పోస్ట్‌పోన్ చేయడంతో 'నాపేరు సూర్య' వచ్చే వరకు అంటే రెండు వారాల పాటు 'భరత్ అనే నేను' వేసవి సెలవులను ఎలా క్యాష్ చేసుకుంటుందో చూడాలి.
ఇక ఈ చిత్రంలో మహేష్ అభిమానులకు నచ్చిన హైలైట్స్ చాలానే ఉన్నాయి. అయితే ప్రెస్‌మీట్‌లో మీడియా పోతున్న పోకడలపై చిటికెలు వేస్తూ మహేష్ చెప్పిన డైలాగ్స్ మాత్రం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతున్నాయి. పోకిరి చిత్రం తర్వాత మహేష్ చిత్రంలో మీడియాను టార్గెట్ చేయడం ఇది మరోసారి. 'పోకిరి'లో షాయాజీషిండే మీద ఆసీన్స్ తీస్తే, నేడు మహేష్‌పై అలాంటి సీన్‌ని తీశారు. ఇక సీఎం ఓ అమ్మాయితో క్లోజ్‌గా ఉంటే పెంట్ హౌజ్‌లో సీఎం రాసలీలలు అని రాసిన వార్తని మహేష్ తప్పు పట్టడం, మీ ఇంట్లో వాళ్లు ఇదే విధంగా ఉంటే ఇలానే రాస్తావా? ఇలాంటి రాతల ద్వారా సంపాదించిన డబ్బుతో కొన్న బియ్యం ఒంటికి పడదు అనే డైలాగ్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి.
ఈ సీన్ నేటి మీడియా తీరును ఎండగడుతూ, మహేష్ చెప్పిన డైలాగ్స్‌కి మంచి స్పందన వస్తోంది. సన్నివేశాలు డిమాండ్ చేస్తే మహేష్ పెర్పార్మెన్స్ ఏ రేంజ్‌లో ఉంటుందో చెప్పడానికి ఈ ఒక్క సీన్ చాలు అనిపిస్తోంది. మొత్తానికి మహేష్ ప్యాన్స్‌కే కాకుండా పవన్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ అందరు ఈ సీన్‌ని చూసి చప్పట్లు కొడుతున్నారు.