నేటి రోజుల్లో పెద్ద పెద్ద హీరోలు, భారీ బడ్జెట్ చిత్రాలలో నటించే ఆర్టిస్టులకే కాదు... ముఖ్యంగా ఆయా హీరోలు, హీరోయిన్లు ఏ కోరిక కోరినా నిర్మాతలు, దర్శకులు కొండమీద కోతిని కూడా తెచ్చిఇస్తారు. నేడు హీరోయిన్లకు ఉన్న డిమాండ్ అలాంటిది. కాబట్టి ఏ కోరికైనా, డిమాండ్‌కైనా దర్శక నిర్మాతలు ఓకే చెబుతారు. ఇక విషయానికి వస్తే ప్రస్తుతం స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్ హీరోగా అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా రచయిత వక్కంతం వంశీని దర్శకునిగా పరిచయం చేస్తూ దేశభక్తి నేపథ్యంలో 'నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా' చిత్రం రూపొందుతోంది. ఇందులో బన్నీ పవర్‌ఫుల్ దేశభక్తి కలిగిన మిలట్రీ ఆఫీసర్ పాత్రను చేస్తున్నాడు. ఈనెల 22న ఆడియోను రిలీజ్ చేసి, 29 వతేదీన ప్రీరిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించి మే 4వ తేదీన చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
ఇక ఈ చిత్రానికి లగడపాటి శ్రీధర్, నాగబాబు, బన్నీ వాసులు నిర్మాణ భాగస్వాములుగా పనిచేస్తున్నారు. ఈ చిత్రంలోని ఓ రొమాంటిక్ సాంగ్‌ని హాలీవుడ్ సినిమా టోగ్రాఫర్‌తో తీయగా, ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో నటించిన హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ షూటింగ్ ముగింపు సందర్భంగా ఒకే ఒక్క కోరికను కోరిందట. అదేమీ పెద్ద ఖర్చుతో కూడుకున్న కోరిక కూడా కాదు. జస్ట్ బన్నీతో ఓ సెల్ఫీ కావాలని ఆమె కోరింది. దాంతో బన్నీ ఆమె కోరికను తీర్చాడు.
దీనిపై బన్నీ స్పందిస్తూ, ఈ షూటింగ్ మొత్తంలో అను కోరిన ఒకే ఒక్క కోరిక. నా హీరోయిన్ అను కోరిన ఫస్ట్ అండ్ లాస్ట్ థింగ్ నాతో ఓ సెల్ఫీ దిగడం అంటూ ఈ సెల్ఫీని ఆయన మీడియాలో పోస్ట్ చేశాడు. అలాగే ఈ సెల్ఫీతో ఈ చిత్రం షూటింగ్ కూడా పూర్తయింది. ఈ నేపధ్యంలో ఇక ప్రమోషన్ల వేగం పెంచి, సినిమాపై అంచనాలు క్రియేట్ చేయడానికి, ఇతర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరపడానికి యూనిట్ సిద్దం అవుతోంది....!