మొత్తానికి శ్రీరెడ్డి వివాదం పుణ్యమా అని మెగా ఫ్యామిలీలో మెగా హీరోలకు, అల్లు హీరోలకు మధ్య ఏర్పడిన స్పర్దలు తొలగిపోయినట్లే కనిపిస్తున్నాయి. ఇప్పటికే వరుణ్‌తేజ్, సాయిధరమ్‌తేజ్‌లతో పాటు బన్నీవాసు, అల్లు అరవింద్‌లు కూడా స్పందించారు. ఇక పవన్ వ్యవహారంలో బన్నీ కూడా స్పందిస్తే ఈ వ్యవహారం మెగాభిమానులను, హీరోలను ఒకే తాటి పైకి తీసుకుని వచ్చిందని చెప్పాలి.
ఇక తాజాగా నడిగర్ సంఘం జనరల్ సెక్రటరీ, తమిళనాడు నిర్మాతల మండలి అధ్యక్షుడైన హీరో విశాల్ దీనిపై బాగా స్పందించాడు. తమకు కాస్టింగ్‌కౌచ్ ఎదురైందని చెప్పి ఓ రెండు ముక్కలు మాట్లాడటం సమంజసం కాదు. చిత్ర పరిశ్రమను చెడ్డగా చూపుతు అలా రెండు మాటలు అనేయడం కాదు. ఆధారాలతో సహా నిరూపిస్తే ఎవరి మీదనైనా చర్య తీసుకుంటాం. గతంలో వరలక్ష్మీ శరత్‌కుమార్, అమలాపాల్ విషయంలో వారు ఆరోపణలు చేస్తే తీవ్ర చర్యలు తీసుకున్నాం. కాస్టింగ్‌కౌచ్ గురించి ఆధారాలతో సహా నిరూపించాలి. అప్పుడు ఖచ్చితంగా బాధ్యులకు న్యాయం జరుగుతుంది. ఎవరో ఒకరిద్దరు చేసే పనులను ఇండస్ట్రీ మొత్తాన్ని అనుమానించేలా చేయవద్దు. సినీరంగంలో అన్యాయాలపై గళమెత్తే మహిళలను నేను గౌరవిస్తాను. అన్యాయం జరిగితే ఖచ్చితంగా న్యాయం చేస్తాం.
ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో ఏర్పడిన సంక్షోభం, కాస్టింగ్‌కౌచ్ విషయం త్వరలోనే ముగుస్తుందని ఆశిస్తున్నానని తెలిపాడు. అయినా ఆధారాలు అంటే శ్రీరెడ్డి చెప్పినట్లు సరైన సమయంలో, సరైన యాంగిల్‌లో ఆధారాలు చూపించేందుకు నటీమణులు ఏమైనా 24 గంటలు మెడలో కెమెరాలు వేసుకుని తిరగాలా? ఏమిటి? అనే సెటైర్లు కూడా బాగానే వినిపిస్తున్నాయి.