Advertisementt

కరికాల రుద్రయ్య వచ్చేస్తున్నాడు..!

Sun 22nd Apr 2018 03:52 PM
kaala,rajinikanth,release,june 7  కరికాల రుద్రయ్య వచ్చేస్తున్నాడు..!
Kaala release date fix కరికాల రుద్రయ్య వచ్చేస్తున్నాడు..!
Advertisement
Ads by CJ

సూపర్ స్టార్ రజినీకాంత్ కి ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తుంది. అటు సినిమాల పరంగాను, ఇటు రాజకీయాల పరంగాను సేమ్ టు సేమ్ అన్నట్టుగా  వుంది పరిస్థితి. రాజకీయాల్లోనూ అనుకున్నట్టుగా సక్సెస్ కాలేకపోతున్న రజినీకాంత్ సినిమాలు విడుదల కూడా పోస్ట్ పోన్ ల మీద పోస్ట్ పోన్స్ అవుతూ ఆయన్ని ఇరకాటంలో పెట్టేస్తున్నాయి. మొన్నటికి మొన్న రోబో 2 .ఓ సినిమా అదిగో విడుదల అంటే...... ఇదిగో విడుదల అన్నారు. కానీ ఆ సినిమా గ్రాఫిక్స్ లేట్ వలన అసలు రోబో 2 .ఓ ఎప్పుడు విడుదలవుతుందో అనేది క్లారిటీ లేకుండా పోయింది. అలాగే రేపు 27  నే విడుదల కావాల్సిన 'కాలా' కూడా అంతే.

గత నెలన్నరగా కోలీవుడ్ లో థియేటర్స్ బంద్ నడుస్తుండడంతో... రజినీకాంత్ - రంజిత్ పాల సినిమా కాలా సినిమా  ఈ నెల 27 న విడుదల వ ఉంటుందో లేదో అనుకున్నారు. అయితే మొదట్లో ఆగష్టు 15 కి అన్నా కూడా రోబో 2 .ఓ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో తెలియదు.. అందుకే కాలా సినిమా నిర్మాత కాలా ని ఏప్రిల్ 27  కి ప్రీ పోన్ చేశాడు. కానీ కోలీవుడ్ లో థియేటర్స్ బంద్ వలన రేపు 27 న విడుదల కావాల్సిన కాలా కాస్తా వాయిదా పడింది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు అంటే సెన్సార్ కార్య్రక్రమాలు కూడా పూర్తి చేసుకుని విడుదల కోసం వెయిట్ చేస్తున్న 'కాలా' ఇప్పుడు తాజాగా జూన్ 7  కి వెళ్ళిపోయింది.

ఇంతకు ముందే 'కాలా' నిర్మాత ధనుష్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. మరి రేఫు 27  న కాలా విడుదల ఉంటుందనుకుని తెలుగు హీరోలు మాములుగా టెన్షన్ పడలేదు. అందులో మహేష్, అల్లు అర్జున్ లు తమ సినిమాల విషయంలో కాలా కనుక ఈ 27 న విడుదలైతే తమ సినిమాల కలెక్షన్స్ పడిపోతాయని కంగారు పడ్డారు. కానీ 'కాలా' విడుదల అలా అనుకోకుండా జూన్ 7 కి షిఫ్ట్ అయ్యింది. ఇక సూపర్ స్టార్ అభిమానులు కాలా కోసం మరో నెలన్నర వెయిట్ చెయ్యాల్సిందే. కానీ ఇక్కడ అల్లు అర్జున్ అండ్ మహేష్ బాబులు ఫుల్ హ్యాపీ అన్నమాట.

Kaala release date fix:

Kaala release on June 7th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ