గత వారం రోజులుగా సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ - రామ్ గోపాల్ వర్మ - శ్రీ రెడ్డి ల వ్యవహారం మాంచి వేడి మీదుంది. మరోపక్క మహేష్ బాబు భరత్ అనే నేను కి ఎన్నడూ లేని విధంగా ప్రమోషన్స్ పర్వం కొనసాగింది. ఇక ఈ సినిమా విడుదల రోజు భరత్ ని, పవన్ ని పక్కన పెట్టేసి కొన్ని చానెల్స్ చంద్రబాబు ఉపవాస దీక్ష కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. శుక్రవారం సినిమా విడుదలై సక్సెస్ టాక్ వచ్చినా భరత్ అనే నేను మీద అస్సలు దృష్టి పెట్టలేదు ఛానల్స్. అలాగే పవన్ కళ్యాణ్, మెగా ఫ్యామిలీ మొత్తం ఫిలిం ఛాంబర్ వద్ద ఉన్నా స్క్రోలింగ్ లేక్ పరిమితం చేశారు.
ఇక మహేష్ బాబు భరత్ అనే నేను ప్రపంచవ్యాప్తంగా విడుదలై అదిరిపోయే టాక్ తెచ్చుకుని సూపర్ హిట్ అయ్యే విధంగా కలెక్షన్స్ రాబడుతుంది. మరి మాములుగా మహేష్ మూవీస్ కి బయట భారీ క్రేజ్ ఉంటుంది. అలాగే మొదటిసారి ఒక స్టార్ హీరో పూర్తిస్థాయి సినిమాలో సీఎం గా నటించడం, అందులోను మహేష్ న్యూ లుక్ తో సీఎం స్థానాన్ని ఎలా భర్తీ చేసాడో అనే క్యూరియాసిటీతో ఉన్న జనానికి మహేష్ సీఎం నటన అరిపించేసింది. అంతమంచి టాక్ వచ్చిన మహేష్ మాత్రం సోషల్ మీడియాలో వెనకబడ్డాడు. అలా మహేష్ సోషల్ మీడియాలో వెనక బడ్డానికి మొదటినుండి చెప్పుకునే రెండు బలమైన కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది పవన్ కళ్యాణ్, రెండోది చంద్రబాబు నాయుడు.
మొదటిది గట్టి కారణమే. అది కూడా పవన్ రూపంలో మహేష్ కి తగిలింది. పవన్ తన మీద తన తల్లి మీద చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని, అయన కొడుకు లోకేష్ ని, తెలుగు రాష్ట్రాల్లో టాప్ లో ఉన్న ఛానల్స్ టీవీ 9 ని, ఏబీఎన్, టీవీ 5 ని కలిపి విమర్శించడం, అలాగే పవన్ తనకు వర్మకు రేగిన వివాదం గురించి పరిష్కారం చూపాలంటూ ఫిలిం ఛాంబర్ కు మెగా హీరోలందరితో వచ్చి అక్కడ లాయర్లతో మీటింగ్ పెట్టడం, అభిమానులందరూ పవన్ కోసం ఫిలిం ఛాంబర్ కి చేరుకోవడం వంటి విషయాలతో సోషల్ మీడియాలో పవన్ ఏం మాట్లాడతాడా అని బాగా సెర్చ్ చెయ్యడంతో సోషల్ మీడియాలో పవన్ టాప్ 3 ట్రేండింగ్ లోకి వచ్చేశాడు.
ఇక మరో కారణం ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన చేపట్టిన ధర్మ దీక్షని అన్ని ఛానల్స్ ఉదయం నుంచి సాయంత్రం వరకు నాన్ స్టాప్ గా లైవ్ కవరేజ్ ఇవ్వడంతో.. మహేష్ కి బాగా దెబ్బపడింది. మహేష్ భరత్ అనే నేను హిట్ టాక్ వచ్చేసి విడుదలైన థియేటర్ల దగ్గర మహేష్ అభిమానుల హాడావిడి ని అసలు కవర్ చెయ్యలేదు. కాని టాప్ 20లో 12 నుండి 17వ స్థానం మధ్యలో భరత్ అను నేను గురించి ట్రెండ్ అయ్యింది. మరి పవన్, బాబు దీక్ష లేకపోతే భరత్ టాప్ 5 లోకి వచ్చేసేవాడే. ఇక భరత్ కి వున్న ధైర్యం ఏమిటంటే విడుదలైన ప్రతి చోటా మంచి పాజిటివ్ టాక్ రావడం, అలాగే రివ్యూస్ కూడా పాజిటివ్ గా రావడమే.