ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Sadha's Prostitute Role movie Titled As Torchlight

సదాని ఈ పాత్రే నిలబెట్టాలి..!

Sadha's Prostitute Role movie Titled As Torchlight

తెలుగులో తేజ 'జయం' చిత్రం ద్వారా పరిచయం చేసిన హీరోయిన్‌  సదా. ఇక ఈచిత్రం ఘన విజయం సాధించడంతో ఈమెకి వరుసగా ఆఫర్లు వచ్చి పడ్డాయి. ఇక ఈమె తెలుగులో కూడా ఎన్టీఆర్‌ సరసన 'నాగ'తో పాటు పలు చిత్రాలలో నటించినా కూడా ఆమెకి ఆ స్థాయి గుర్తింపును మాత్రం ఏ చిత్రాలు తేలేకపోయాయి. ఇక విక్రమ్‌ హీరోగా శంకర్‌ తీసిన 'అపరిచితుడు' చిత్రం ఘన విజయం సాధించినా కూడా ఆ హిట్‌ ఆమె ఖాతాలో పడలేదు. ఇక ఇటీవల ఏవైనా చిన్న పాత్రలు, టివీ షోలకు జడ్జిగా వస్తున్న ఆమె తాజాగా ఓ చిత్రంలో నటించడానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. 

అర్ధరాత్రి పూట లారీ డ్రైవర్లు వంటి వారి విటుల కోసం హైవేపై నిల్చునే వేశ్యపాత్రగా ఈ చిత్రంలో ఆమె పాత్ర ఉంటుంది. ఈ చిత్రానికి కథకు తగ్గట్లుగానే 'టార్చ్‌లైట్‌' అనే టైటిల్‌ని పెట్టారు. ఈ చిత్రానికి మజీద్‌ దర్శకుడు. వాస్తవానికి ఈ పాత్ర సదాకి రాకముందు పలువురు హీరోయిన్లకు దర్శకుడు వినిపించాడు. కానీ ఎవ్వరూ ఆ పాత్రను చేయడానికి ముందుకు రాలేదు. చివరగా సదా మాత్రం ఈ చిత్రంలో నటించేందుకు ఓకే చెప్పింది. అంతేకాదు.. ఈ చిత్రంలోని పాత్రలను, వాటిని మలిచిన తీరుని చూసి ఆమె దర్శకుడు మజీద్‌ని అభినందించడమే కాకుండా ఆయన దర్శకత్వంలో ఓ సినిమాని నిర్మిస్తానని కూడా సదా తెలిపింది. 

ఇక ఇలాంటి వేశ్యపాత్రల బ్యాక్‌డ్రాప్‌ గల చిత్రాలు ఎప్పుడో గానీ 'వేదం' వంటివి వస్తూ ఉంటాయి. మరి వేశ్యగా సదా ఏమేరకు దర్శకుడి అంచనాలను, ప్రేక్షులను మెప్పిస్తుందో చూడాలి...! ఈ చిత్రం హిట్‌ అయితే దీనిని ఆమెకి రీఎంట్రీగా భావించవచ్చు. తద్వారా రెగ్యులర్‌ చిత్రాలలో కూడా కీలకమైన పాత్రలు, సపోర్టింగ్‌ రోల్స్‌లో ఆమె బిజీ అవ్వడం ఖాయంగా చెప్పవచ్చు.

Sadha Turns Into Prostitute For Abdul Majith's Torchlight

sadha
prostitute
abdul majith
torchlight