హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ లోని ఫిల్మ్ ఛాంబర్ నిత్యం రద్దీగానే ఉంటుంది. పలువురు దర్శక నిర్మాతలు, హీరోలు ఎప్పుడు వారి పనుల కోసం ఫిల్మ్ ఛాంబర్ కి వచ్చి వెళుతుంటారు. అయితే రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో శ్రీ రెడ్డి, పవన్ కళ్యాణ్ ని ఆయన తల్లిని దూషించినందుకు గాను.. పవన్ కళ్యాణ్ ఈ రోజు ఫిల్మ్ ఛాంబర్ లో లాయర్లతో మీటింగ్ పెట్టి.. తనపై నీచమైన వ్యఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకునే దిశగా పావులు కదుపుతున్నాడు. అయితే పవన్ కోసం కేవలం పవన్ ఫ్యాన్స్ మాత్రమే కాదు... అక్కడ మెగా ఫ్యామిలీ హీరోలు మొత్తం కనబడుతున్నారు. తమ్ముడికి మద్దతుగా నాగబాబు వస్తే బాబాయ్ కి మద్దతుగా రామ్ చరణ్, వరుణ్ తేజ్ లు వచ్చారు.
అలాగే ఇంకా పెద్ద విశేషమేమిటంటే.. పవన్ కళ్యాణ్ అంటే అంటీముట్టనట్టు ఉండే అల్లు అర్జున్ పవన్ కి సపోర్ట్ గా ఫిల్మ్ ఛాంబర్ కి చేరుకున్నాడు. అక్కడికి చేరుకున్న అల్లు అర్జున్ ఉన్నట్టుండి పవన్ కళ్యాణ్ ని హత్తుకున్నాడు. ఇక అక్కడే ఉన్న మెగా ఫ్యాన్స్ ఈ దృశ్యాన్ని చూసి మైమరిపోయారంటే నమ్మాలి. ఇక సాయి ధరం తేజ్ తో పాటు నటి హేమ, ఇంకా ఇతర మా సభ్యులు కూడా ఫిల్మ్ ఛాంబర్ లో హడావిడి చేస్తున్నారు. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అండ్ బ్యాచ్ ఫిల్మ్ ఛాంబర్ లోపల లాయర్లతో మట్లాడుతూ తాను తీసుకోబోయే యాక్షన్ మీద మాట్లాడుతున్నట్టుగా ఉన్నాడు.
పవన్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ అంతా పవన్ కళ్యాణ్ కి మద్దతుగా ఫిల్మ్ ఛాంబర్ కి భారీగా చేరుకుంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ తన తల్లిని దూషించిన విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు కొడుకు లోకేష్ తన స్నేహితుడితో కలిసి 10 కోట్ల పెట్టుబడి పెట్టి మరి తనపై బురద జల్లే ప్రయత్నం చేశారని.. ఈ విషయంలో సీఎం కొడుకు లెవెల్ నుంచి మీడియా మహామహులు ఉన్నారంటూ పవన్ ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇకపోతే ప్రస్తుతం మెగా ఫ్యామిలీ హీరోలంతా ఫిల్మ్ ఛాంబర్ లో పవన్ కళ్యాణ్ కి మద్దతుగా నిలబడగా... మరికొద్ది సేపట్లోనే అక్కడికి చిరంజీవి కూడా రాబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.