గతంలో బన్నీ ఒక స్టేజిపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు పవన్ కళ్యాణ్ గురించి చెప్పమంటే చెప్పను బ్రదర్ అంటూ జవాబు ఇచ్చాడు. అప్పటి నుండి బన్నీకి వ్యతిరేకంగా పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రాలింగ్ చేయడం ప్రారంభించారు.
అప్పటి నుండి బన్నీ ఫ్యాన్స్ అండ్ పవన్ ఫ్యాన్స్ ఎవరికి వారు సపరేట్ గా బ్యాచులు ఫామ్ చేశారు. అయితే లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ తల్లిని ఉద్దేశించి శ్రీరెడ్డి గట్టిగా వ్యాఖ్యలు చేయడం... దాని వెనుక రామ్ గోపాల్ వర్మ ఉన్నాడని తెలియడంతో అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టి మరీ రామును చీల్చి చెండాడడం వంటివి కనిపించాయి.
ఇక ఇదే విషయంపై పవన్ కళ్యాణ్ నిన్న నైట్ స్పందించాడు. కన్నతల్లి గౌరవాన్ని కాపాడలేకపోతే.. తాను బతికి ఉండడమే అనవసరం అన్నాడు పవన్. అలానే వర్మను ఇండైరెక్ట్ గా కామెంట్స్ చేశాడు. అయితే ఇక్కడ ఇంకో విషయం ఉంది. పవన్ చేసిన ప్రతి ట్వీట్ కు రీట్వీట్ చేయడాన్ని విశేషంగా చెప్పుకోవాలి. గతంలో పవన్ తో బన్నీకి విబేధాలు ఉన్నాయనే మాటలకు.. ఈ రీట్వీట్లతో అల్లు అర్జున్ సమాధానం ఇచ్చాడని భావించవచ్చు.