ఎవరి సహనానికైనా ఓ హద్దు ఉంటుంది. ఈ విషయంలో రాంగోపాల్‌వర్మ, శ్రీరెడ్డిలు గీత దాటారు. ఇక శ్రీరెడ్డికి మొదట్లో మద్దతు తెలిపి, కాస్త ఆమె బాధను కూడా అర్ధం చేసుకున్న వారు కూడా పవన్‌ని అనవసరంగా ఈ వివాదంలోకి లాగి పవన్‌ని, అతని తల్లిని శ్రీరెడ్డి పైత్యంతో చేసిన బూతు మాటలు, సంజ్ఞలతో ఫైర్ అవుతున్నారు. ఇంతవరకు తాము సహనంగా ఉండమని తమ మెగా ఫ్యాన్స్‌కి చెబుతూ వస్తున్నామని, ఇకపై మాత్రం యుద్దానికి రెడీ అవుతున్నామని మెగా ఫ్యామిలీ తరపున బన్నీవాస్ హెచ్చరికలు జారీ చేశాడు.
ఇక శ్రీరెడ్డి వ్యాఖ్యల వెనుక వర్మ ఉన్నాడని ఆయనే ఓ వీడియోను రిలీజ్ చేయడంతో బన్నీవాస్ రెచ్చిపోయాడు. సహనంగా ఉండాలని చెప్పే నాకు ఈ డ్రామా వెనక వర్మ ఉండి నడిపిస్తున్నాడని తెలిసి, నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఇక మేం బయటకు వస్తున్నాం. యుద్దానికి సిద్దంగా ఉండండి. మేమెంటో చూపించడానికి మేము సిద్దం. మెగాభిమానులందరితో కలిసి యుద్ద ప్రణాళికను రచిస్తామని తెలిపాడు. ఇక పవన్ మీద వర్మ ప్రోత్భలంతో శ్రీరెడ్డి చేసిన బూతు వ్యాఖ్యలు తీవ్ర జుగుప్సాకరంగా ఉన్నాయి. అదే సమయంలో ఆమె మాటల వల్ల అసలు ఆమె లేవనెత్తిన కాస్టింగ్‌కౌచ్ అనేది దారి మరలిందని విశ్లేషకులు భావిస్తున్నారు.