Advertisementt

'సాహో' లో కొంచెం ఎక్కువైనట్లుంది!

Fri 20th Apr 2018 05:23 PM
saaho,evelyn sharma,prabhas,bollywood heroine  'సాహో' లో కొంచెం ఎక్కువైనట్లుంది!
One More Bollywood Heroine in Saaho 'సాహో' లో కొంచెం ఎక్కువైనట్లుంది!
Advertisement
Ads by CJ

ప్రభాస్.. సుజిత్ దర్శకత్వంలో 'సాహో' సినిమా చేస్తున్నాడు. బాహుబలి తర్వాత భారీగా తెరకెక్కుతున్న 'సాహో' చిత్రం పై భారీ అంచనాలే ఉన్నాయి. దేశంలోనూ నాలుగు భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మంచి క్రేజ్ ఉంది. యూవీ క్రియేషన్స్ వారు బహు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఎక్కువగా బాలీవుడ్ ని టార్గెట్ చేసినట్లుగా అనిపిస్తుంది. మరి హాలీవుడ్ స్టాండర్డ్స్ తో తెరకెక్కుతున్న 'సాహో' ఎక్కువగా బాలీవుడ్ కే పెద్ధ పీట వేస్తుంది. అందులో భాగంగానే బాలీవుడ్ నుండి హీరోయిన్ ని తెచ్చిన టీమ్ విలన్స్ ని కూడా  బాలీవుడ్ నుండే ఏరుకొచ్చింది. ఇప్పటివరకు నీల్ నితిన్ ముఖేష్ విలన్  పాత్రలోను, శ్రద్దా కపూర్ హీరోయిన్ గాను, మందిరా బేడీ, టిన్ను ఆనంద్ వంటి బాలీవుడ్ నటులు  సాహో సినిమాలో  పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

కాగా ఇప్పుడు కొత్తగా 'సాహో' కోసం మరో బాలీవుడ్ బ్యూటీ దిగుతుంది. బాలీవుడ్ భామ ఎవెలిన్ శర్మ కూడ ఈ సాహో సినిమాలో నటిస్తుంది. ఇప్పటికే అగ్రిమెంట్ పూర్తి చేసిన ఎవెలిన్ శర్మ...... 'సాహో' లో యాక్షన్ మోతాదు ఎక్కువగా ఉండే పాత్రలో నటించనుంది. ఇక ఆమె 'సాహో'లో నటిస్తున్నాను అని కన్ఫర్మ్ చేస్తూ.. 'సాహో’లో నటించడం ఒక గౌరవంగా భావిస్తున్నానని, సంతోషంగా ఉందంటూ తన సాహో ముచ్చట్లు చెప్పుకొచ్చింది. మరి ఇలా లెక్కలేనన్ని బాలీవుడ్ నటులను సాహో కోసం తెస్తున్నారు అంటే... సుజిత్ అండ్ టీమ్ 'సాహో' విషయంలో బాలీవుడ్ ని ఒక చూపు చూడాలని డిసైడ్ అయినట్లుగా కనబడుతుంది.

మరి ఇప్పటికే ప్రభాస్ అండ్ సుజిత్ ల ప్లాన్ సగం వర్కౌట్ అయినట్లే. ఎందుకంటే 'సాహో' హిందీ హక్కులని ని అధిక మొత్తం లో టి సీరీస్ వారు దక్కించుకున్నారు. ప్రస్తుతం దుబాయ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రథమార్ధం లో విడుదల కావొచ్చనే ఊహాగానాలు ఉన్నాయి.

One More Bollywood Heroine in Saaho:

Evelyn Sharma joins Prabhas and Shraddha Kapoor in Saaho 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ