ప్రతి చిత్రం పూర్తయిన తర్వాత విదేశాలకు వెకేషన్ వెళ్లేవాడిని. కానీ 'భరత్ అనే నేను' సినిమా విషయంలో మాత్రం సినిమా రిలీజ్ కాకముందే హాలీడే ట్రిప్‌చేసి వచ్చాను. ఈచిత్రం మీద నాకున్న నమ్మకం ఇలాంటిది. నా కెరీర్‌లో బెస్ట్ రిలీజ్ అని చెప్పవచ్చు. సినిమా విడుదలకు ముందే ఎంతో కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. సినిమా విడుదల కాకముందే ఒక బ్లాక్‌బస్టర్ వైబ్‌లా ఉంది. శివగారు ఈ కథ చెప్పిన వెంటనే ఎగ్జైట్ అయ్యాను. అదే సమయంలో కాస్త భయం కూడా వేసింది. సీఎం పాత్ర చేయడం ఓ పెద్ద ఆనర్. రెస్పాన్సిబులిటీ కూడా. ఈ కథతో రెండేళ్లు ట్రావెల్ చేయడంవల్ల చాలానే నేర్చుకున్నాను. కానీ రాజకీయాలలోకి రావడానికి మాత్రం కాదు. ఈ పాత్ర కోసం మా బావగారు గల్లాజయదేవ్ పార్లమెంట్ వీడియోస్‌ని కొన్ని చూశాను. అంతకు మించి పెద్దగా హోం వర్క్ చేసిందిలేదు. శివగారి ఇన్‌పుట్స్ తీసుకున్నాను. ఈ మొత్తం క్రెడిట్ ఆయనకే ఇస్తాను.
ఒక పొలిటికల్ చిత్రానికి మాటలు రాయాలంటే చాలా కష్టం. లాజిక్స్ కరెక్ట్‌గా ఉండాలి. నేనెక్కడా నెర్వస్‌గా ఉండకుండా వర్క్ చేశాం. ఎక్స్‌ట్రార్డినరీగా క్యారెక్టర్స్‌ని డిజైన్ చేశారు. పొలిటికల్ సినిమాలలోడైలాగ్స్ మనం రోజు మాట్లాడుకునే మాటల్లా ఉండవు. ఫస్ట్‌టైం నా కెరీర్‌లో పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్పాను. పేజీల పేజీలు డైలాగ్స్ చెప్పాను. కష్టం అనిపించింది. శివగారి హెల్ప్‌తో చెప్పాను. కథ విన్న మొదటిరోజే మాస్టర్ పీస్ తీస్తున్నామన్న నమ్మకం కలిగింది. దానికి దేవి ఇచ్చిన ధీమ్‌సాంగ్ కూడా ఒక కారణం. ఆ సాంగ్ ఫస్ట్‌టైం విన్నప్పుడు నేను చెన్నైలో ఉన్నాను. అసెంబ్లీ సెట్స్ నుంచి అన్ని అద్భుతం. ఇక నిజమైన అసెంబ్లీ సెషన్స్‌లానే చేశాం. షూటింగ్ లేకున్నా రోజు అసెంబ్లీసెట్‌కి వెళ్లేవాడిని. ఎవరి మీద సెటైర్లు ఉండవు. ఈచిత్రం విడుదలైన తర్వాత అన్ని పార్టీల వారు మా సినిమాని మెచ్చుకుంటారు.
రాజకీయాలంటే నాకు అసలు ఇష్టం లేదు. సినిమానే ప్రాణం. జీవితాంతం నటునిగానే ఉంటాను. నా జీవితం సినిమాలకే అంకితం. ఒక ఏడాది పాటు ఓ సినిమాతో జర్నీ చేశామంటే ఆ ప్రభావం మన మీద ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా రెస్పాన్సిబులిటీ ఉన్న పర్సన్‌లా ఉండాలని డిసైడ్ అయ్యాను. ఒక పాత్ర నుంచి అంత త్వరగా డిస్కనెట్ కావడం కష్టమే. అందుకే సరదాగా ఫ్యామిలీ ట్రిప్‌కి వెళ్లాను. శివ గారి ప్రతి చిత్రంలో మెసేజ్ ఉంటుంది. ఇందులోనూ ఉంది. పొలిటికల్ ఫిల్మ్ వచ్చి చాలా కాలం అయింది. మరలా ఆ జోనర్‌ని తిరిగి తెచ్చాం అనిపిస్తోంది.
ఇక కొరటాల శివ కమర్షియల్, మాస్ యాంగిల్‌ని వదలరు. ఇక ఈచిత్రంలో సీఎం అయి ఉండి ఎలా ఫైట్స్ చేస్తాడు? ఎలా స్టెప్పులేస్తాడు? అనేది యూనిక్ సెల్లింగ్ పాయింట్. ఈ చిత్రం చూస్తే ప్రజలందరూ మరింత రెస్పాన్సిబులిటీగా ఫీలవుతారు. ఇంకా రాజకీయాలతో బాగా కనెక్ట్ అవుతారు. సీఎం పదవి అనేది ఈజీకాదు. అది ఎంతో బాధ్యతతో కూడిన పదవి. ఇలాంటి పాత్రను నేను చేయడం ఎంతో ఆనందంగా ఉంది. సీఎం అంటే జడ్‌ప్లస్ క్యాటగరీలో కాన్వాయ్‌లో తిరగడం కాదు. ఎన్నో బాధ్యతలు ఉంటాయి. రాష్ట్రాన్ని ఎలా కాపాడాలి? అనే బాధ్యత ఉంటుంది. సీఎం పదవి చాలా బాధ్యత. జనాలను రిప్రజెంట్ చేయడం సామాన్యమైన విషయం కాదు. మా ఇంట్లో పిల్లలకు రాజకీయ డైలాగ్‌లు అర్ధం కావడం లేదు. కానీ పాటలు మాత్రం పాడుతూనే ఉన్నారు.. అని మహేష్ చెప్పుకొచ్చాడు.