Advertisementt

టాలీవుడ్ లో పొలిటికల్ వార్..!!

Fri 20th Apr 2018 01:12 AM
tollywood,political based movies,ntr biopic,bharat ane nenu  టాలీవుడ్ లో పొలిటికల్ వార్..!!
Political Touch Movies Trending in Tollywood టాలీవుడ్ లో పొలిటికల్ వార్..!!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం టాలీవుడ్ లో పొలిటికల్ జోనర్స్ మూవీస్ వరస కట్టాయి. ఎలక్షన్స్ కి ఇంకా ఏడాది కూడా లేకపోవడంతో ఇప్పటి నుండే పొలిటికల్ జోనర్స్ లో మూవీస్ స్టార్ట్ అయ్యాయి. ప్రస్తుతం ఈ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయటానికి రెడీ గా ఉన్నాయ్.

లేటెస్ట్ గా రానా నటించిన తేజ డైరెక్షన్ లో నేనే రాజు నేనే మంత్రి సినిమాతో పొలిటికల్ జోనర్ సందడి స్టార్ట్ అయింది. ఆ తర్వాత మహేష్ బాబు - కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న చిత్రంతో మహేష్ తొలిసారిగా సీఎం పాత్రలో నటిస్తున్నాడు. ఇక బాలకృష్ణ తన తండ్రి నందమూరి తారక రామ రావు బయోపిక్ ను తెరకెక్కించనున్నాడు.  ఇది కూడా పొలిటికల్ జోనర్ టచ్ చేసే సినిమానే.

ఇక మంచు నిర్మాతగా విజయ్ దేవరకొండ హీరోగా నోటా పేరుతో ఓ సినిమా నిర్మిస్తున్నాడు. ఈ సినిమా ప్రజాస్వామ్యంలో ప్రజల బాధ్యత తెలియజేసేలా చిత్రం ఉంటుందని మంచు విష్ణు చెబుతున్నాడు. అలానే ఆనందబ్రహ్మ ఫేం డైరెక్టర్ మహి వి. రాఘవ్ మళయాళ నటుడు ముమ్ముట్టితో వై.ఎస్.రాజశేఖర రెడ్డి బయోపిక్ తీస్తున్నాడు. యాత్ర టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఎలక్షన్స్ టైంకి మరి కొన్ని పొలిటికల్ డ్రామాలు మొదలయ్యే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ప్రస్తుతం అందరి దృష్టి పాలిటిక్స్ పైనే ఉంది కాబట్టి.. ఈ జోనర్ లో సినిమాలకు ప్రేక్షకులు తొందరగా కనెక్టయ్యే అవకాశముంది.

Political Touch Movies Trending in Tollywood:

Political War in Tollywood

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ