Advertisementt

ఆర్పీ, చక్రిల గురించి కౌసల్య ఇలా చెప్పింది!

Thu 19th Apr 2018 06:38 PM
singer kousalya,rp patnaik,chakri,vamsi  ఆర్పీ, చక్రిల గురించి కౌసల్య ఇలా చెప్పింది!
Singer Kousalya about RP Patnaik and Chakri ఆర్పీ, చక్రిల గురించి కౌసల్య ఇలా చెప్పింది!
Advertisement
Ads by CJ

తెలుగులో ఉన్న మంచి సింగర్స్‌లో కౌసల్య కూడా ఒకరు. ఇక ఈమెకి ఆర్పీపట్నాయక్‌ వరుసగా మూడు చిత్రాలలో సింగర్‌గా అవకాశాలు ఇచ్చారు. ఆర్పీ పట్నాయక్‌ సంగీతం అందించిన మొదటి చిత్రం,రవితేజ హీరోగా నటించిన తొలిచిత్రం 'నీకోసం' చిత్రంలో టైటిల్‌ సాంగ్‌ ద్వారా కౌసల్య ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈ చిత్రం ద్వారానే వేణు, నిహాల్‌, మణి నాగరాజ్‌ వంటివారు గాయకులుగా పరిచయం అయ్యారు. ఆతర్వాత 'చిత్రం' మూవీలో 'ఏకాంత వేళ' అనే పాట పాడింది. 

అదే సమయంలో సంగీత దర్శకుడు చక్రిగారు నన్ను పిలిపించి 'చిత్రం' సినిమాలో 'ఏకాంతవేళ' అనే పాట పాడిన అమ్మాయి అని దర్శకుడు పూరీ జగన్నాథ్‌కి పరిచయం చేశారు. దాంతో పూరీగారు 'ఇంకా టెస్ట్‌ చేయడం ఎందుకు? పాడించేసేయ్‌' అని గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ఆ తర్వాత వరసగా పాటలు వచ్చాయి. చక్రిగారి ప్రతి చిత్రంలో నాతో పాటలు పాడించారు. 'నా చిత్రాలకు వరుసగా పాడటం నీకు ప్లసే కాదు.. మైనస్‌ కూడా అని చక్రి నాతో అనేవారు. నేనంటే పడనివారు నీచేత పాడించరు' అని చెప్పారు. చక్రిగారు మరణించే సమయానికి నాలుగైదేళ్ల ముందే ఆయన నాకు అవకాశాలు ఇవ్వడం తగ్గించేశారు. నేను అడిగితే 'అంతపెద్ద బడ్జెట్‌ చిత్రాలు కావుఇవి. నీకు తక్కువ ఇచ్చిపాడించడం నాకు ఇష్టం లేదు' అనే వారు అని చెప్పుకొచ్చింది కౌసల్య. ఇక ఈమె చక్రి స్వరకల్పనలో పెద్ద వంశీ దర్శకత్వంలో వచ్చిన చిత్రాలలో పాడి.. వంశీ చేతనే సెహభాష్‌ అనిపించుకుంది. 

Singer Kousalya about RP Patnaik and Chakri:

Singer Kousalya Latest Interview 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ