నిడివి ఎక్కువగా ఉన్నా కూడా కథ, కథనాలలో పస ఉంటే దానికి నిడివి సమస్య అడ్డంకి కాదని 'రంగస్థలం' నిరూపించింది. ఇప్పుడు అదే కాన్ఫిడెన్స్‌తో కొరటాల శివ-మహేష్‌బాబుల 'భరత్ అనే నేను' చిత్రం వస్తోంది. ఈ చిత్రం విజయం సాధించాలంటే జరిగిన భారీ ప్రీ రిలీజ్ బిజినెస్‌కి తగ్గట్టుగా చిట్టిబాబును క్రాస్ చేస్తేనే సక్సెస్ సాధించినట్లు అవుతుంది. ఇక భారీగా ప్రీమియర్లు ప్లాన్ చేయడంతో మొదటి వీకెండ్‌లో కలెక్షన్లు అదిరిపోతాయని అంటున్నారు. ఇక 'భరత్ అనే నేను' కూడా ఏడు నిమిషాలు తక్కువ మూడు గంటల నిడివితో వస్తోంది. మహేష్ యంగ్ అండ్ డైనమిక్, స్టైలిష్ సీఎంగా కనిపించనున్నాడనే విషయం అభిమానులలో ఆసక్తిని రేపుతోంది. ఇక మహేష్ కూడా ప్రచార కార్యక్రమాలు స్టార్ట్ చేశాడు. వచ్చే రెండు మూడు వారాలు ఆయన పలు టివి చానెల్స్, మీడియా ద్వారా ప్రమోషన్ల వేగం పెంచనున్నాడు.
ఇక ఈ చిత్రం కోసం నమ్రతా సరికొత్త ప్రమోషన్స్‌కి శ్రీకారం చుడుతోంది. సోషల్ మీడియాలో దీనికి పాజిటివ్ రెప్పాన్స్ రావడం కోసం స్పెషల్‌గా ఓ టీంని నియమించడంతో పాటు ఒక్క హైదరాబాద్‌లోనే 200ల హోర్డింగ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఇలా భారీస్థాయిలో హోర్డింగ్స్‌తో ప్రమోషన్ చేయడం ఈ స్థాయిలో తెలుగులో తొలిసారి అని చెప్పవచ్చు. ఇందుకోసం ఒక్క హైదరాబాద్‌కే హోర్డింగ్‌ల రూపంలో నిర్మాత దానయ్య మూడు కోట్లు ఖర్చుచేస్తున్నారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో కలపి 400 వరకు హోర్డింగ్స్‌ని ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఎటు చూసినా మన కొత్త ముఖ్యమంత్రే కనిపించేలా ప్రమోషన్స్‌ని భారీగా ప్లాన్ చేశారు.
ఇక ఇటీవలే హైదరాబాద్‌లోని ఎల్బీస్టేడియంలో భారీగా ప్రీరిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తంగా ఈ చిత్రంలోని అమరావతి ఫైట్, అసెంబ్లీ ఎపిసోడ్‌లు కీలకంగా ఉంటాయని, ఇక మహేష్‌తో పాటు కైరా అద్వానీ, శరత్‌కుమార్, ప్రకాష్‌రాజ్, పోసాని కృష్ణమురళి వంటి వారి పాత్రలు కూడా సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని, అలాగే రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ సినిమాని మరోస్ధాయికి తీసుకెళ్లడం గ్యారంటీ అంటున్నారు. ఏ హీరోతో చేస్తే వారికి ప్రతిసారి ఇండస్ట్రీహిట్‌లను ఇస్తోన్న కొరటాల శివ 'భరత్ అనే నేను' ద్వారా మహేష్‌కి మరోసారి నాన్‌బాహుబలి రికార్డులను బద్దలు కొట్టే చిత్రం ఇవ్వడం గ్యారంటీ అని అందరు ఎంతో నమ్మకంగా ఉన్నారు. చిన్నగా బాక్సాఫీస్ వద్ద 'రంగస్థలం' జోరు తగ్గిన క్రమంలో 'భరత్ అనే నేను' వేగం పుంజుకుంటోందనే చెప్పాలి.