ఈనెల 20 న విడుదలకు సిద్ధం అవుతున్న మహేష్ బాబు భరత్ అనే నేను సినిమాపై ఒక రేంజ్ లో ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయ్. సినిమాలోని సాంగ్స్..ట్రైలర్స్ కు మంచి టాక్ రావడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. లేటెస్ట్ గా సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా...ఇన్సైడ్ టాక్ ప్రకారం సినిమా అదిరిపోయిందని టాక్ నడుస్తుంది.
మొదటిసారిగా మహేష్ బాబు సీఎంగా నటించటం ఈ సినిమాకు హైలైట్ అని చెబుతున్నారు. సీఎంగా ఉంటూనే ఎలాంటి డిప్లమసీ లేకుండా పబ్లిక్ అవేర్‌నెస్ కోసం మహేష్ చేసే కొన్ని పనులు విజిల్స్ కొట్టిస్తాయట. కొన్ని సీన్స్ లో అయితే మహేష్ ఇరగతీసేశాడంట. లీడర్ అంటే ఇలానే ఉండాలి.... దేశం బాగుంటుంది కదా అని జనం ఒప్పుకుని తీరేలా అద్భుతమైన సీన్లు రాశారట. ఈ సినిమాలో చాలా సీన్స్ జనాలు విజిల్స్, క్లాప్స్ కొట్టేలా ఉంటాయి అని టాక్.
ఓవరాల్ గా ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందని టీం భావిస్తుంది. ఇక ఫ్యాన్స్ కూడా ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డును క్రియేట్ చేస్తుందని ధీమాగా ఉన్నారు. రంగస్థలం సినిమాను క్రాస్ చేస్తుందో? లేదో చూడాలి.