నటుడు, హీరో శ్రీహరి తాను ప్రభుదేవా దర్శకత్వంలో 'ఆర్..రాజ్‌కుమార్' షూటింగ్ జరిగే సమయంలో జ్వరం వచ్చి హాస్పిటల్‌లో చేరాడని, డాక్టర్లు చెప్పినట్లు ఆయన హాస్పిటల్‌లో చేరినప్పుడు ఆయనకు జాండీస్ అధికంగా లేదని ఆయనకు హార్ట్ ఎటాక్ రాలేదని ఆయన భార్య శాంతి చెబుతోంది. ఈమె మాట్లాడుతూ, జ్వరం రావడంతోనే శ్రీహరి హాస్పిటల్‌లో చేరాడు. ఆయన మధ్యాహ్నం 12 గంటల వరకు మాతో మాట్లాడుతూ గడిపాడు. ఉన్నట్లుండి ఆయన నాలుక మడతలు పడినట్లుగా మాటలు తడబడుతూ వచ్చాయి. దాంతో నేను పెద్దగా అరిచి డాక్టర్లను పిలిచాను, నర్సులు వచ్చారు. అప్పుడు శ్రీహరి నోటి నుంచి ముక్కు, చెవుల నుంచి రక్తం వచ్చింది. వెంటనే డాక్టర్లు నన్ను బయటకు పంపివేశారు. మా బంధువులను పిలిపించారు.
శ్రీహరి మరణించిన విషయం నాకు రాత్రి వరకు చెప్పకుండా దాచారు. శ్రీహరి కేవలం డాక్టర్ల తప్పుడు ట్రీట్‌మెంట్ వల్లనే మరణించాడని చెప్పుకొచ్చింది. ఇక ఈమె డిస్కో శాంతిగా శ్రీహరి వివాహం చేసుకునే ముందు వరకు తెలుగు ప్రేక్షులను తన స్టెప్స్, ఐటం సాంగ్స్‌తో ఓ ఊపు ఊపింది. కానీ శ్రీహరిని వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు బైచెప్పింది, శ్రీహరి మరణంతో డిప్రెషన్‌కి లోనైంది. ఇంతకాలం పిల్లలను పెంచడంపై మాత్రమే దృష్టిపెట్టింది. ఇప్పుడు పిల్లలు పెద్ద వారయ్యారు కాబట్టి మరలా రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని శాంతి అంటోంది.
ఇప్పటి వరకు నా వద్దకు చాన్స్‌లు రాలేదు గానీ వస్తే రీఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. అలాగని గుంపులో గోవింద పాత్రలు చేయను. అలాంటివి చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు. పిల్లలు పెద్దయ్యారు కాబట్టి కథలో ప్రాధాన్యం ఉన్న పాత్రలు వస్తే చేస్తాను. దాని వల్ల నలుగురిలో తిరుగుతూ, మాట్లాడుతూ, కాస్త రిలాక్స్ అవుతానని చెప్పుకొచ్చింది.