దేశంలోనే కాదు ఈ భూమి మీద పురుషాధిక్యం నడుస్తోందనేది అందరు అంగీకరిస్తారు. మనపెద్దలైతే దేవుడే శారీరకంగా,మానసికంగా కూడా పురుషులను మహిళల కంటే బలంగా తయారుచేశాడని అంటారు. ఎంత ఆడవారు అయినా కూడా వారు చెప్పేవన్నీ నిజాలని, మగాళ్లందరు ఘోరాలు, నేరాలు చేసేవారని నిర్ధారణకు రావడం తప్పు. దేశంలో ఇప్పటికే వరకట్నం, లైంగిక వేధింపులు, గృహహింస వంటి పలు కఠినమైన చట్టాలు ఉన్నాయి. ఇక ఎస్సీ, ఎస్టీలకు కూడా ప్రత్యేక చట్టాలను ప్రభుత్వాలు రూపొందిస్తున్నాయి. అయితే వీటిలో ఎక్కువ శాతం అవి కేవలం కొందరి చేతిలోనే, అందునా కక్ష్య సాధింపు కేసుల్లో ఎక్కువగా నమోదవుతున్నాయని పలు సర్వేలు చెబుతున్నాయి.
ఇక తాజాగా శ్రీరెడ్డి చేస్తున్న పోరాటంలో నిజం ఉన్నప్పటికీ ఆమె నిరసన తెలుపుతున్న విధానం, బూతులతో మాట్లాడుతున్న తీరు మాత్రం హేయంగా చెప్పుకోవాలి. ఆమె పవన్‌కళ్యాణ్‌ని ఉద్ధేశించి, ఆయన తల్లిని అవమానించేలా పచ్చిబూతులు మాట్లాడింది. పవన్‌ని అన్నా అనిపిలిచినందుకు తనచెప్పులతో తాను కొట్టుకోవాలని, ఇక నుంచి ఎవ్వరూ ఆడవారు పవన్‌ని అన్నా అని పిలవద్దని బూతులతో శ్రీరెడ్డి అసభ్య సంజ్ఞలు చేస్తూ రెచ్చిపోయింది. మరోనటి పవన్‌కి మసాజ్ చేయడం కోసం బెంగాలీ అమ్మాయిలు కావాలా? అని రెట్టించింది. ఇక ఎవరైనా హీరోని, అందునా ఎంతో ఫాలోయింగ్ ఉన్న హీరోని ఏదైనా అనరాని మాటలు అన్నప్పుడు సహజంగానే వారి అభిమానులు ఆరోపణలు చేసిన వారిపై విరుచుకుపడతారు. దేనికైనా ఆధారం చూపాలంటే ఎలా? ఆధారం ఉంటేనే మేము మాట్లాడాలా? అంటూ కొందరు వితండవాదన చేస్తున్నారు. ఈ విషయంలో తప్పుని నిరూపించాల్సిన బాధ్యత, పోలీసు కేసు పెట్టి వారికి సాక్ష్యాలు ఇవ్వడం తప్పనిసరి. లేకపోతే ఇప్పుడు వీరు పవన్‌పై చేసిన ఆరోపణలే, రేపు ఆయా నటీమణులపై అభిమానులు పలు గాసిప్స్ క్రియేట్ చేయడానికి ఆస్కారం కలిగిస్తుంది.
ఇక మన చట్టంలో న్యాయదేవత కళ్లు కట్టేది, కేవలం ఆధారాలు చూపమనే. ఆధారాలు లేవని చెప్పి ఏవేవో ఆరోపణలు చేయడం సరికాదు. ఇక ఈ విషయంలో హైపర్ ఆదితో పాటు పవన్ ఫ్యాన్స్‌కూడా సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంతో మందికి ఆదర్శనీయునిగా ఉన్న ఓ వ్యక్తి మీద అతని తల్లిని అసభ్యంగా తిడుతూ, కామెంట్స్ చేయడంపై పవన్ ఫ్యాన్స్‌మండిపడుతున్నారు. చట్టం ముందు అందరు సమానులే. అంతే గానీ అక్కడ ఆడ, మగా అనే తేడాఉండకూడదు. ఇక సామాజిక కార్యకర్త సంద్య తెలుగు ప్రేక్షకుల తరపున అడుగుతున్నాను. సినిమా రంగంమంటే ఆ నాలుగైదు ఫ్యామిలీలేనా? ఇక తెలుగులో ఎవరిలో టాలెంట్ లేదా? 60ఏళ్ల వయసులో కూడా 'అమ్మడు లెట్స్ డు కుమ్ముడు' అంటున్నారు. ఎంత కాలం ఈ గుత్తాధిపత్యం అని ప్రశ్నించింది. మరి ఈ రగడ ఎక్కడి వరకు వెళ్తుందో..!