Advertisementt

జీవిత రాజశేఖర్ కేసు పెట్టింది..!!

Wed 18th Apr 2018 08:10 PM
jeevitha,jeevitha rajasekhar,case,sandhya,sri reddy  జీవిత రాజశేఖర్ కేసు పెట్టింది..!!
Jeevitha Angry on Channel and Women Leader Sandhya జీవిత రాజశేఖర్ కేసు పెట్టింది..!!
Advertisement
Ads by CJ

శ్రీ రెడ్డి రచ్చ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీని ఒక కుదుపు కుదిపేస్తోంది. బట్టలిప్పేసి మరి తాను అనుకున్నది సాధించిన శ్రీ రెడ్డి... ప్రస్తుతం అసలు విషయాన్ని పక్కనపెట్టేసి పవన్ కళ్యాణ్ ని ఈ విషయంలోకి లాగింది. అయినా ఊరుకుండా పవన్ పై కారుకూతలు కూసింది.... అడ్డం గా బుక్ అయ్యింది. పవన్ సపోర్టర్స్ నుండి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటుంది. అయితే మహిళా సంఘాలు శ్రీ రెడ్డికి మద్దతునిస్తూ సినిమా వాళ్ళని వాళ్ళు కూడా అనకూడని మాటలన్నారు.మహిళా సంఘాల నేత సంధ్య ఇండస్ట్రీలోని కాస్టింగ్ కౌచ్ మీద మాట్లాడుతూ..  జీవిత గారు తన భర్త కోసం హాస్టల్ నుండి అమ్మాయిలను తెస్తారని... ఇంకా ఇండస్ట్రీలోని చాలామంది ని ఆమె అనకూడని మాటలనడం, మహా టీవీ ఈ విషయాన్నీ పదే  పదే ప్రచారం చెయ్యడంతో ఆగ్రహించిన జీవిత మహా టీవీ మీద, మహిళా సంఘాల నేత సంధ్య మీద, అక్కడ డిబేట్ లో యాంకర్ గా చేసిన వారి మీద కేసు పెట్టి మరి ప్రెస్ మీట్ పెట్టి వారిని కడిగిపారేసింది. 

మేము సమాజంలో గౌరవంగా బ్రతుకుతున్నామని... నేను నా భర్త కోసం అమ్మాయిలను తీసుకెళ్లడం మీరు చూసారా... అంటూ సంధ్య కి డైరెక్ట్ ప్రశ్న వేసింది జీవిత. అలాగే ఇండస్ట్రీలో ఇంత జరుగుతున్నప్పటికీ సీనియర్స్ ఎవరు ముందుకు వచ్చి వాటిని ఖండించడం లేదంటూ జీవిత రాజశేఖర్ మండి పడింది. శ్రీరెడ్డి ఓ పది మందిని గుంపుగా పోగేసుకుని తమను సినిమాల్లో తీసుకునే తీరాలి అని డిమాండ్ చేయటం ఎంత వరకు కరెక్ట్ అన్న జీవిత... శ్రీ రెడ్డి తనని మోసం చేసిన వారిపై కేసు పెట్టాలి కానీ.. ఇలా ఛానల్స్ లో కూర్చుని రచ్చ చెయ్యడం తగదని చెప్పిన జీవిత సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదని తాను చెప్పడం లేదని... కేవలం సినిమా రంగంలోనే  కాదు.. ఎక్కడ లేదు కాస్టింగ్ కౌచ్ అంటూ ఆమె నిలదీశారు.  అలాగే శ్రీరెడ్డికి మొదట మెంబర్ షిప్ ఇవ్వము అని చెప్పడం 'మా' చేసిన పిచ్చి పని అని చెప్పిన జీవిత అది మాత్రం ముమ్మాటికి తప్పేనని తెగేసి చెప్పింది.

ఆ తర్వాత మాలాంటి వాళ్ళం అందరం మా కి ఫోన్స్ చేసి చెప్పామని... తర్వాత మా సభ్యులు శ్రీ రెడ్డికి మెంబర్ షిప్ ఇవ్వడానికి ఒప్పుకున్నారని జీవిత అన్నారు. తాను ఈ ఇష్యు గురించి ఒక రోజు పట్టించుకోలేదని... కానీ రెండో రోజు మూడో రోజు కూడా తన భర్త మీద ఆరోపణలు చేస్తుంటే సహించలేకే ఇలా ప్రెస్ మీట్ పెట్టానని... మహిళా సంఘాల నేత సంధ్యకి తమ గురించి ఏం తెలుసనీ ఇలాంటి వ్యాఖ్యలు చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక అసలు క్రేజ్ లేని నటీమణులను తీసుకుని నిర్మాతలు బిచ్చమెత్తుకోవాలా అని అడిగిన జీవిత... ఇండస్ట్రీలో తమని మోసం చేశారని.. ఆధారాలతో తమ దగ్గరికి వస్తే తగిన న్యాయం చేస్తామని చెప్పారు. ఇంత మాట్లాడిన జీవిత చివరిలో దాసరి గారు గనక బ్రతికుంటే... ఈ కథ మరోలా ఉండేదని అన్నారు. అయన చనిపోయారు కాబట్టే చాలామంది నోళ్లు లెగుస్తున్నాయని అన్న జీవిత.. పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తే... ఆయన ఫాన్స్ వస్తారని భయపడిన వాళ్ళు జీవిత రాజశేఖర్ ని విమర్శిస్తే ఎవరేం చేస్తారులే అనుకుంటున్నారా అంటూ తమని విమర్శించిన వారిని నేరుగా హెచ్చరికలు జారీ చేసింది.

Jeevitha Angry on Channel and Women Leader Sandhya:

>Jeevitha Fires on Channel & Women Leader

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ