Advertisementt

ఎన్టీఆర్ సినిమా బ్యాగ్రౌండ్ ఇదేనంట..!

Wed 18th Apr 2018 03:46 PM
jr ntr,rayalaseema,village,rajamouli,trivikram srinivas  ఎన్టీఆర్ సినిమా బ్యాగ్రౌండ్ ఇదేనంట..!
NTR Fighting In Rayalaseema Village ఎన్టీఆర్ సినిమా బ్యాగ్రౌండ్ ఇదేనంట..!
Advertisement
Ads by CJ

ఎన్టీఆర్ -త్రివిక్రమ్ ల సినిమా పట్టాలెక్కేసింది. అనుకున్న ఆరు నెలలకు సెట్స్ మీదకెళ్ళిన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ప్రస్తుతం క్రేజ్ లో ఉన్న పూజ హెగ్డే, ఎన్టీఆర్ సరసన నటిస్తుంది. త్రివిక్రమ్ తన గత సినిమా అజ్ఞాతవాసి ప్లాప్ ని దృష్టిలో పెట్టుకుని ఎన్టీఆర్ తో తెరకెక్కిస్తున్న ఫ్యామిలీ కథా చిత్రాన్ని పకడ్బందీగా అందరూ మెచ్చేలా పూర్తి స్క్రిప్ట్ లాక్ చేసి మరి ఎన్టీఆర్ తో పాటు సెట్స్ మీదకెళ్ళాడు. ఈ సినిమాని ఆరు నెలల్లో పూర్తి చేసి దసరా సెలవులకు విడుదల చేస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు నిర్మాతలు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వారు.

ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో రెండెకరాల్లో ప్రత్యేకంగా వేసిన సెట్ లో ఈ నెల 13 నుంచే త్రివిక్రమ్ - ఎన్టీఆర్ ల సినిమా షూటింగ్ నిరవధికంగా జరుగుతోంది. అక్కడ వేసిన సెట్ లో రాయలసీమ గ్రామీణ వాతావరణాన్ని ప్రతి బింబించేలా ఆ సెట్ ను రూపొందించినట్టుగా సమాచారం. ఇక ఈ సినిమాలో ఫ్యామిలీ సెంటిమెంట్ తో పాటే.. ఫ్యామిలీ ఎమోషన్స్, అలాగే యాక్షన్ సన్నివేశాలు కూడా కావాల్సినంత ఉన్నట్టుగా చెబుతున్నారు. ఇక ఈ సినిమా కోసం ఎన్టీఆర్ పూర్తి ఫిట్ నెస్ తో కొత్తగా కాకపోయినా మంచి లుక్ లోకి మారిపోయాడు.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కేవలం అంటే కేవలం 6 నెలల్లోనే పూర్తి చెయ్యాలనే కమిట్మెంట్ తో ఎన్టీఆర్ అండ్ త్రివిక్రమ్ లు ఉన్నారు. అందుకే ఎన్టీఆర్ కూడా బిగ్ బాస్ సీజన్ 2 ని కూడా పక్కన పెట్టేశాడు. ఇకపోతే ఎన్టీఆర్ సరసన పూజ హెగ్డే నటిస్తుండగా... మరో సీనియర్ హీరోయిన్ కూడా త్రివిక్రమ్ సినిమాలో ఉందనే టాక్ వుంది. బట్ ఆవిడెవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్ లో పెట్టిన విషయం తెలిసిందే. ఇక ఎన్టీఆర్, త్రివిక్రమ్ తో సినిమా ఫినిష్ చేసి మళ్ళీ జక్కన్న సినిమా కోసం లుక్ చేంజ్ చేసుకోవాలి. అందుకు కనీసం రెండు నెలల టైం అయినా పడుతుంది. అందుకే దసరాకి త్రివిక్రమ్ సినిమాని ఫినిష్ చేసి అక్టోబర్, నవంబర్ కల్లా జక్కన్న కోసం ఎన్టీఆర్ రెడీ అవుతాడన్నమాట.

NTR Fighting In Rayalaseema Village:

NTR shooting in Rayalaseema sets

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ