Advertisementt

చరణ్, బోయపాటి టైటిల్ ఫిక్సయిందా?

Wed 18th Apr 2018 03:22 PM
ram charan,boyapati srinu,new movie,rajavamsasthudu  చరణ్, బోయపాటి టైటిల్ ఫిక్సయిందా?
Charan-Boyapati's film Title Rajavamsasthudu? చరణ్, బోయపాటి టైటిల్ ఫిక్సయిందా?
Advertisement
Ads by CJ

రంగస్థలం సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న రామ్ చరణ్ తన నెక్స్ట్ మూవీ కోసం రెడీ అయిపోయాడు. బోయపాటి వస్తున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. త్వరలోనే రెండో షెడ్యూల్ ను స్టార్ట్ చేయనున్నారు చిత్ర యూనిట్.

ఈ షెడ్యూల్ నుంచి రామ్ చరణ్ షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నాడు. ఇక ఈ సినిమా టైటిల్ ని ఫిక్స్ చేయలేదు డైరెక్టర్ బోయపాటి. అయితే లేటెస్ట్ గా ఈ సినిమాకు ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ ని అనుకున్నట్టు తెలుస్తుంది. సినిమా కథకు తగ్గట్టుగానే ఈ సినిమాకి 'రాజవంశస్థుడు' అనే టైటిల్ అయితే బాగుంటుందని బోయపాటి భావిస్తున్నాడట.

అయితే రామ్ చరణ్ తో పాటు చిరంజీవి కూడా ఈ టైటిల్ కు తమ ఆమోదాన్ని తెలియజేయవలసి ఉంటుంది. అందరికి నచ్చితే 'రాజవంశస్థుడు' అనే టైటిల్ ను ఫిక్స్ చేయనున్నాడు. అయితే ఇదే టైటిల్ ఖరారవుతుందో .. మరో కొత్త టైటిల్ తెరపైకి వస్తుందో చూడాలి.  

Charan-Boyapati's film Title Rajavamsasthudu?:

Is this Ram Charan and Boyapati Film Title?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ