ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Charan-Boyapati's film Title Rajavamsasthudu?

చరణ్, బోయపాటి టైటిల్ ఫిక్సయిందా?

Charan-Boyapati's film Title Rajavamsasthudu?

రంగస్థలం సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న రామ్ చరణ్ తన నెక్స్ట్ మూవీ కోసం రెడీ అయిపోయాడు. బోయపాటి వస్తున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. త్వరలోనే రెండో షెడ్యూల్ ను స్టార్ట్ చేయనున్నారు చిత్ర యూనిట్.

ఈ షెడ్యూల్ నుంచి రామ్ చరణ్ షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నాడు. ఇక ఈ సినిమా టైటిల్ ని ఫిక్స్ చేయలేదు డైరెక్టర్ బోయపాటి. అయితే లేటెస్ట్ గా ఈ సినిమాకు ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ ని అనుకున్నట్టు తెలుస్తుంది. సినిమా కథకు తగ్గట్టుగానే ఈ సినిమాకి 'రాజవంశస్థుడు' అనే టైటిల్ అయితే బాగుంటుందని బోయపాటి భావిస్తున్నాడట.

అయితే రామ్ చరణ్ తో పాటు చిరంజీవి కూడా ఈ టైటిల్ కు తమ ఆమోదాన్ని తెలియజేయవలసి ఉంటుంది. అందరికి నచ్చితే 'రాజవంశస్థుడు' అనే టైటిల్ ను ఫిక్స్ చేయనున్నాడు. అయితే ఇదే టైటిల్ ఖరారవుతుందో .. మరో కొత్త టైటిల్ తెరపైకి వస్తుందో చూడాలి.  

Is this Ram Charan and Boyapati Film Title?

ram charan
boyapati srinu
new movie
rajavamsasthudu