ముక్కుపచ్చలారని ఎనిమిదేళ్ల్ల చిన్నారి ఆసిఫాపై జమ్మూకాశ్మీర్‌లోని ప్రముఖ దేవత గుళ్లో దారుణంగా మానభంగం చేసి, హత్య చేసిన దుర్ఘటన ఏ మనసునైనా ఇట్టే కరిగించి వేస్తోంది. దీనిపై మీడియాలో, సామాన్యులలో కూడా కోపం కట్టలు తెంచుకుంటోంది. సోషల్ మీడియా సాక్షిగా కూడా పలువురు నెటిజన్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎంత రాతి గుండె కలిగిన వారికైనా హృదయం ద్రవించేలా చేస్తున్నఈ ఘటన పలువురిని కలచివేస్తోంది. దాంతో సినీ నటీమణులు హిందుస్దానీ అయినందుకు సిగ్గుపడుతున్నాం అంటూ ప్లేకార్డ్‌లు పట్టుకుని తమ నిరసనలను తెలియజేస్తున్నారు.
కానీ నిజానికి సినీ హీరోయిన్లు అంటే దేశం మొత్తం ఒక్కసారిగా అలర్ట్ అవుతుంది. కానీ నటీమణులు మాత్రం ఏదో సినిమాలకి పబ్లిసిటీ చేసినట్లు మొక్కుబడిగా ప్లేకార్డ్‌లు చేతులో పట్టుకుని దీనికి ఫుల్‌స్టాప్ పెట్టకుండా తమవంతు పాపులారిటీతో ఇలాంటివి ఆగేదాకా ఉద్యమించాల్సిన సమయం వచ్చింది. ఇక దేశాన్ని కదిపేసిన ఈ కథువా ఘటనపై నిరసనగా టాలీవుడ్ నటి మెహ్రీన్ కూడా ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. నేను హిందుస్తానీని. నేను సిగ్గుపడుతున్నా...8ఏళ్ల చిన్నారి ఆలయంలో మానభంగానికి లోనై హత్య కావించ బడింది..అంటూ ప్లేకార్డు పెట్టుకుని ఓ ఫొటోని పోస్ట్ చేసింది.
దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. నువ్వు హిందుస్తానీవని సిగ్గుపడుతుంటే వేరే దేశం వెళ్లు. నేను హిందుస్తానీని అయినందుకు గర్వపడుతున్నాను అని రీట్వీట్ చేశాడు. దీనికి మెహ్రీన్ సమాధానం ఇస్తూ, నీలాంటి వాళ్ల గురించే నేను ఈ పోస్ట్ పెట్టానని ఘాటుగా సమాధానం ఇచ్చింది. దీనిపై పలువురు నెటిజన్లు మెహ్రీన్ భలే కౌంటర్ ఇచ్చింది ..సెహభాస్ అంటూ ఆమెని ప్రశంసిస్తున్నారు....!