రాంగోపాల్‌వర్మ ఎక్కడ ఉంటాడో వివాదం అక్కడ ఉంటుంది. ఆయన ఏమి చేసినా, ఏమీ చేయక పోయినా కూడా అది వార్తే అవుతుంది. నిజానికి మౌనంతో కూడా వార్తల్లో ఉండటం ఒక్క వర్మకే తెలుసని చెప్పాలి. ఇక ఈయనలో మరో కోణం కూడా ఉంది. నిజాన్ని కుండలు బద్దలు కొట్టినట్లు చెప్పి, ఆల్‌రెడీ రేగిన వివాదానికి మరింత ఆజ్యం పోసి రెచ్చగొట్టడంతో ఎవరైనా ఆయన తర్వాతే. ఇక డ్రగ్స్ విచారణ జరిగేటప్పుడు ఆయన చార్మి విచారణకు వెళ్లిన తీరు, తర్వాత బయటకి వచ్చిన బాడీలాంగ్వేజ్‌ని చూసి ఝూన్సీ లక్ష్మీభాయ్‌లా కనిపిస్తోందని కామెంట్ చేశాడు. ఆ తర్వాత కత్తి మహేష్, పవన్ ఫ్యాన్స్ వివాదంలోకి కూడా ఎంటరై కత్తి మహేష్‌కి మద్దతు పలికాడు. ఇక 'అర్జున్‌రెడ్డి' వివాదం కూడా పెద్దది కావడంలో మనోడు తనకు చేతనైనంత చేశాడు.
ఇక తాజాగా శ్రీరెడ్డి విషయంలో ఆయన మాట్లాడుతూ, కోఆర్డినేటర్లందరు బ్రోకర్లేనని పేర్కొన్నాడు. అసలు కోఆర్డినేటర్ చేసే పని ఏమిటి? అని చెబుతూనే పిఆర్వోలు, మేనేజర్ల తీరు కూడా ఇలాగే ఉంటుందని చూచాయగా అన్ని విషయాలను గుట్టు విప్పాడు. కోఆర్డినేటర్లు 50మంది అమ్మాయిల ఫోటోలు పంపితే అందులో స్పెషల్ క్యాటగిరీ కింద కాంప్రమైజ్ అయ్యే పదిమందినే ప్రత్యేకంగా పంపుతారని, అది తనకే కాదు... ప్రతి డైరెక్టర్‌కి వారు చేసే పని అదేనని చెప్పాడు. ఇక శ్రీరెడ్డి విషయంలో ప్రస్తుతం అందరు చేస్తున్న విమర్శ ఏమిటంటే.. శ్రీరెడ్డి అందరితో బాగా క్లోజ్‌గా మూవ్ అయి, వారిని తనతో లైంగికంగా వాడుకోవడానికి సంసిద్దత తెలిపి, ఇప్పుడు బయటికి వచ్చి నీతులు చెబుతోంది.. అనేది ప్రధాన విమర్శ. ఆయా ఫొటోలలో శ్రీరెడ్డి కూడా ఎంతో నవ్వుతూ, చాటింగ్‌లలో కూడా వారిని ప్రోత్సహిస్తూ ఉందనే విమర్శకు వర్మ సరైన సమాధానం ఇచ్చాడు. అశోకుడు ఎందరినో చంపి, తర్వాత నిజం తెలుసుకుని ఎన్నో లక్షల ప్రాణాలను కాపాడాడని, శ్రీరెడ్డి కూడా అదే చేస్తోందని ఆయన లాజిక్కు విప్పాడు.
ఇది కూడా చాలా ముఖ్యమైన పాయింటే. తాను చెడిపోయి, బాధలు పడినా మరోకరు అలా పడకూడదనే ఉద్దేశ్యంతో బయటికి వచ్చి పోరాటం చేయడం సమంజసమేననేది వర్మ వాదన. ఇక గతంలో శ్రీరెడ్డిని ఆయన ఝాన్సీ లక్ష్మీభాయ్‌తో పోల్చాడు. తాజాగా ఆయన మాట్లాడుతూ, శ్రీరెడ్డి నిజాయితీని ఎదుర్కోలేక కొందరు పురుషులు వణికిపోతున్నారు. ఆమెకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న మహిళలంతా ఆమె మీద అసూయ ఉన్నవారే. నిజంగా నిజాయితీ ఉన్నమహిళలు మాత్రమే శ్రీరెడ్డికి మద్దతు ఇస్తున్నారని వర్మ అనడం అగ్గికి ఆజ్యం పోయడమేనని చెప్పాలి...!