చాలాఏళ్ల కిందట మహేష్‌బాబు తండ్రి సూపర్‌స్టార్ కృష్ణ 'ముఖ్యమంత్రి' అనే టైటిల్‌తో ఏకంగా ఒక చిత్రం చేశాడు. ఇక ఇటీవల కాలంలో రానా మొదటి చిత్రం 'లీడర్' తప్ప స్టార్ హీరోలు ముఖ్యమంత్రిగా కనిపించింది లేదు. ఇక ఇప్పుడు మహేష్‌బాబు 'భరత్ అనే నేను' ద్వారా ముఖ్యమంత్రిగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక ఈ చిత్రంలో శాసనసభ సమావేశాల ఎపిసోడ్ హైలైట్ అవుతుందిట. దాదాపు 15 నిమిషాల భారీ ఎపిసోడ్‌ని సింగిల్ టేక్‌తో కొరటాల శివ మెప్పించిన తీరు చిత్రానికే హైలైట్‌గా నిలుస్తుందని అంటున్నారు.
ఇక మహేష్‌కి రాజకీయాలపై అవగాహన లేదని తానే ఎన్నో సార్లు చెప్పాడు. వాటిపై ఆసక్తి కూడా లేదని చెప్పాడు. మరి అలాంటి మహేష్ ఈచిత్రంలో ముఖ్యమంత్రిగా ఎలా మెప్పించనున్నాడు? అనేది ఓ ప్రశ్నగా మిగిలింది. ఇక మహేష్‌ని ముఖ్యమంత్రిగా నటించేందుకు కొరటాల శివ ఎలా కన్విన్స్ చేశాడు? అనే అనుమానం కూడా ఉంది. దీనిపై కొరటాల మాట్లాడుతూ, ఈ చిత్రం కథ విన్నప్పటి నుంచి మహేష్‌కి ఒకటే భయం. కారణం ఈ పాత్రను నేను చేయగలనా? అని. దాంతో ఇంటర్‌నెట్‌లో అసెంబ్లీ సమావేశాల వీడియోలు, రాజకీయ నాయకుల బాడీ లాంగ్వేజ్‌లు గమనించాడు.
ట్రైలర్ విడుదలయ్యాక ఓత్ సీన్‌కి సంబంధించిన డైలాగ్స్‌లో రాజకీయ నాయకుల తరహా గాంభీర్యం సరిపోదేమోనని భావించాం. కానీ క్లాస్ ముఖ్యమంత్రిగా మహేష్ ఏ రేంజ్‌లో చేసి ఉంటాడో అనే అంచనాలు పెరగడం, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రేక్షకులను మహేష్‌బాబు ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశపరచడు అని కొరటాల శివ ఎంతో నమ్మకంగా చెబుతున్నాడు. మొత్తానికి 'రంగస్థలం'ని బ్రేక్ చేయడానికి వస్తోన్న మహేష్ 'భరత్ అనే నేను'తో దానిని సాధిస్తాడో లేదో వేచిచూడాల్సివుంది....!