Advertisementt

వర్మ కూడా కాస్టింగ్‌కౌచ్‌ చెప్తున్నాడు..!

Tue 17th Apr 2018 12:42 PM
ram gopal varma,casting couch,tollywood,coordinator  వర్మ కూడా కాస్టింగ్‌కౌచ్‌ చెప్తున్నాడు..!
Ram Gopal Varma Opens Up On Casting Couch వర్మ కూడా కాస్టింగ్‌కౌచ్‌ చెప్తున్నాడు..!
Advertisement
Ads by CJ

ఏ విషయం మీదనైనా ముక్కుసూటిగా మాట్లాడే వర్మ శ్రీరెడ్డి వ్యవహారంపై మరోసారి నోరు విప్పాడు. కాస్టింగ్‌ కౌచ్‌, ఎక్స్‌ప్లాయిటేషన్‌ సినిమా రంగంలో పాతుకుని పోయి ఉన్నాయి. ఒక బలవంతమైన, డబ్బున్న వ్యక్తి తన వద్దకు అవసరాల కోసం, వేషాలు కోసం వచ్చే వారిని బలవంతంగా లొంగదీసుకునే ప్రక్రియే కాస్టింగ్‌కౌచ్‌.. నిజానికి ఇది బలవంతునికి, బలహీనునికి మధ్య జరిగే వ్యవహారం. దాదాపు ప్రతి ఒక్క అమ్మాయి సినిమాలలో చాన్స్‌ల కోసం ఇలా కాంప్రమైజ్‌ కావాల్సిందే. అయితే బడా బడా ఫ్యామిలీలు, సినీ వారసురాళ్లకు మాత్రం మినహాయింపు ఉంటుంది. బ్లాక్‌ అండ్‌ వైట్‌ కాలం నుంచి ఇది ఉంది. 

'నాడు సినిమాలలోకి వచ్చే వారిని ఓ దుర్భుర్థితో చూసేవారు. తర్వాత మీడియా పెరిగిన తర్వాత ఇది అందరికీ తెలుస్తోంది. దాదాపు చిన్న నిర్మాతలందరు ఇలాంటి వారే. రియల్‌ ఎస్టేట్‌లో సంపాదించినదంతా వీరు సినిమాలలో పెట్టుబడి పెడుతుంటారు. వీరికి సినిమా తీయడం కన్నా కాస్టింగ్‌కౌచ్‌ మీదనే ప్యాషన్‌ ఎక్కువ. కాస్టింగ్‌కౌచ్‌ అనేది కోఆర్డినేటర్‌ నుంచి మొదలవుతుంది. కోఆర్డినేటర్‌ అంటే కేవలం బ్రోకరే. ఓ దర్శకునికి ఓ 50మంది ఫొటోలు పంపినప్పుడు వారిలో 10మందిని కాంప్రమైజ్‌ అయ్యే అమ్మాయిల జాబితాతో ఆ పేర్లలిస్ట్‌ని తయారు చేస్తారు. ఇక అమ్మాయికి చాన్స్‌ కావాలంటే కోఆర్డినేటర్‌తో కూడా కాంప్రమైజ్‌ కావాల్సిందే. కోఆర్డినేటర్‌ అనే బ్రోకర్‌ ఎంతో మంది అమ్మాయిలను హ్యాండిల్‌ చేస్తాడు. నాకే కాదు ప్రతి డైరెక్టర్‌కి బ్రోకర్‌గా కోఆర్డినేటర్‌ ఖచ్చితంగా ఉంటాడు. ఇక్కడ కోఆర్డినేటర్‌ అనేది ఓ జాబ్‌. దానికి టాలెంట్‌, డబ్బు అవసరం లేదు. డబ్బు కోసం ఇతరులు వేర్వేరు పనులు చేసినట్లే...కో ఆర్డినేటర్‌ కూడా వాడి పని వాడు చేస్తాడు..' అని చెప్పుకొచ్చాడు వర్మ. ఇక కోఆర్దినేటర్లే కాదు...నేడు ఈవెంట్‌ నిర్వాహకులు, పర్సనల్‌ మేనేజర్లు కూడా బ్రోకర్లుగా మారుతుండటం విశేషం. ప్రతి అమ్మాయి వీరి చేతుల్లో పడిన తర్వాతే తెరపై అవకాశాలను పొందుతుంది అనేది వాస్తవం.

Ram Gopal Varma Opens Up On Casting Couch:

Ram Gopal Varma Sensational comments On Tollywood Casting Couch

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ