సహజంగా ఎక్కడైనా గొడవలు జరుగుతుంటే మధ్యలో పెద్ద మనుషులు రాజీ చేస్తుంటారు. గొడవ పెట్టుకున్నవారు కూడా పెద్ద మనుషుల మాటలకు విలువ ఇచ్చేటట్లు ఉంటేనే రాజీకి ముందుకు వస్తారు. ఇప్పటి వరకు శ్రీరెడ్డి తన విషయంలో పవన్‌కళ్యాణ్ స్పందించాలని కోరింది. అదే పనిగా పవన్‌ని స్పందించాలని కోరిందంటే ఆయన చెప్పే అంశాన్ని ఆమె అమలు చేసేటటు వంటి పరిస్థితి ఉంటేనే అతడిని స్పందించాలని కోరే హక్కు ఉంటుంది. ఇక శ్రీరెడ్డి వ్యవహారంలో ఆమెకి మద్దతు పెరుగుతున్నప్పటికీ ఆమె నిరసన తెలిపిన వివాదం, మీడియాలో చేస్తున్న రచ్చ విషయంలో మాత్రం అందరు శ్రీరెడ్డి దుందుడుకు వ్యవహారాన్ని తప్పే అని చెబుతున్నారు. నిన్న మొన్నటి వరకు ఆమె లగ్జరీ లైఫ్ అనుభవించిందని, పెద్ద పెద్ద వారు కూడా వాడని ఖరీదైన కారు. దానికి మించిన అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ వంటి వాటిల్లో జల్సా చేసిందని, కానీ ఈ మధ్య తన ఆదాయం తగ్గడంతో ఆమె కేవలం బ్లాక్‌మెయిలింగ్‌కే ఇలా చేస్తోందని పలువురి అనుమానం.
తాజాగా ఆమె అనుకున్నది నెరవేరిందని, సినీ పెద్దలు దిగివచ్చి తమ పేర్లు బయట పెట్టకుండా ఉండేందుకు భారీగా డబ్బులు ఇచ్చారని తెలుస్తోంది. దీంతో నిన్నటి వరకు ఆమెకి సపోర్ట్ చేసిన వారు కూడా ఈ పరిణామంతో ఖంగుతిన్నారట. ఇక తాజాగా పవన్ శ్రీరెడ్డి విషయం మీద స్పందించాడు. తాను ఎవరు అన్యాయానికి గురైనా వారికి మద్దతు ఇస్తానని, అయినా అన్యాయం జరిగిందని చెప్పేటప్పుడు పోలీస్‌లు, న్యాయస్థానం వంటి వాటికి ఎందుకు వెళ్లలేదు? అనే అనుమానం పవన్‌కి సైతం వచ్చింది. ఎవరికైనా అన్యాయం జరిగితే ముందుగా మీడియాకి ఎక్కే ముందు పోలీస్‌లు, న్యాయస్థానాలను ఆశ్రయిస్తారు. ఇదే విషయాన్ని పవన్ చెప్పి ఆమె ఎందుకు అక్కడికి వెళ్లలేదు? అని ప్రశ్నించాడు. టీవీలలో చర్చ వల్ల ఏమీ లాభం ఉండదని, కొంతకాలం తర్వాత అందరు మర్చిపోతారని, న్యాయంజరిగే అవకాశం ఉండక పోవచ్చు అన్నాడు. సెన్సేషన్ కోసం కాకుండా న్యాయం జరిగేందుకు కృషి చేయాలని ఆయన కోరారు.
ఇక పవన్‌ని శ్రీరెడ్డి స్పందించమంటే స్పందించి పెద్దమనిషిగా తనవంతు తాను చెప్పాడు. మరి వాటిని శ్రీరెడ్డి ఎంతవరకు పాటిస్తుంది? ఈమె శేఖర్ కమ్ములపై ఆరోపణలు చేసి యూటర్న్ తీసుకుంది. ఇక తాజాగా 'భరత్ అనేనేను' రిలీజ్ సమయంలో కొరటాల శివ పేరును చెప్పడం వంటివి చూస్తే ఆమెకి న్యాయం కన్నా బ్లాక్ మెయిలింగ్, ఇతర చీప్ పబ్లిసిటీనే కోరుకుంటుందేమో అనే అనుమానం రాకమానదు...!