Advertisementt

తమన్నా.. చిరు కోసం కాదా..?

Tue 17th Apr 2018 08:57 AM
tamannaah bhatia,sye raa narasimha reddy,chiranjeevi  తమన్నా.. చిరు కోసం కాదా..?
Tamannaah Bhatia joins Chiranjeevi's Sye Raa తమన్నా.. చిరు కోసం కాదా..?
Advertisement
Ads by CJ

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మాతగా ఎంతో ప్రతిష్ట్మాకంగా తెరకెక్కుతున్న 'సై రా నరసింహారెడ్డి' షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. చిరంజీవి, అమితాబ్ లపై ఇప్పటికే కొన్ని సన్నివేశాలను తెరకెక్కించిన సురేందర్ రెడ్డి... 'సై రా' హీరోయిన్ నయనతార, చిరులపై మరికొన్ని సన్నివేశాలను పూర్తి చేశాడు. ఇప్పటికే చిరు, అమితాబ్, నయనతార 'సై రా లుక్స్' లీకై సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాదు... ఆ పిక్స్ కి ప్రేక్షకుల నుండి విపరీతమైన స్పందన కూడా వచ్చింది. ఇక ఈ సినిమాలో నయనతారతో పాటు మరో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారనే ప్రచారం ముందు నుండి ఉంది.

అందులో ఒక పాత్రకి ప్రగ్య జైస్వాల్ ని ఎంపిక చేసిన సై రా టీమ్ మరో హీరోయిన్ గా తమన్నాని తీసుకున్నారనే ప్రచారం గత వారం రోజులుగా విపరీతంగా జరుగుతోంది. ప్రస్తుతం ఆఫర్స్ లేని తమన్నాకి సై రా నుండి పిలుపురావడంతో కాస్త నెత్తిన పాలు పోసినట్లైంది. అయితే తమన్నా సై రా లో చిరంజీవికి జోడిగా నటిస్తుందనుకున్నారు అంతా. చిరుతో తమన్నా ఎలా వుండబోతుందో అంటూ అనేక రకాల ఊహాగానాలు హల్చల్ చేశాయి. అయితే తమన్నా సై రా సినిమాలో నటిస్తున్నది అనే మాట వాస్తవమే.. కానీ తమన్నా, చిరుకి జోడిగా మాత్రం నటించడం లేదంట.

సై రా సినిమాలో అనేక భాషా నటులు భాగస్వామ్యం అయ్యారు. సై రా సినిమాని అనేక భాషల్లో విడుదల చెయ్యాలనే సంకల్పంతో సై రా టీమ్ ఈ సినిమా కోసం తెలుగు, తమిళ, కన్నడ, బాలీవుడ్ నటులను తీసుకుంది. అందులో భాగంగానే తమిళం నుండి సై రా కీలక పాత్రలో నటిస్తున్న తమిళ స్టార్ విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నాడు. అయితే తమన్నా ఈ విజయ్ సేతుపతి పాత్రకు జోడీగానే నటిస్తుందని తెలుస్తోంది. అయితే.. తెలుగులో  భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సినిమా కావడం.... అందులోను చిరంజీవి చిత్రం కావడంతో.. తమన్నా ఏ మాత్రం సందేహించకుండా ఈ పాత్రలో నటించేందుకు ఒప్పుకుందట.

Tamannaah Bhatia joins Chiranjeevi's Sye Raa:

Tamanna lead role in Sye Raa Narasimha Reddy Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ