Advertisementt

సమంత టైమ్ నడుస్తోంది..!

Tue 17th Apr 2018 04:52 AM
samantha,u turn,mahanati,journalist,rangasthalam  సమంత టైమ్ నడుస్తోంది..!
Samantha Busy with Back to Back Movies సమంత టైమ్ నడుస్తోంది..!
Advertisement
Ads by CJ

ఈ ఏడాది ఇప్పటివరకు ఏ హీరోయిన్ కి రాని పేరు సమంత కి వచ్చింది. మరి పెళ్ళైనా సమంత హవా ఏ మాత్రం తగ్గలేదు. తెలుగు ప్రేక్షకులు సమంత ని అభిమానంగా ఆదరిస్తూనే ఉన్నారు. నిన్నగాక మొన్న వచ్చిన రంగస్థలం సినిమాలో రామలక్ష్మిలా 1980 లలో పల్లెటూరి అమ్మాయి మాదిరిగా అదరగట్టే నటనతో ఆకట్టేసుకుంది. మాసిన బట్టలు వేసుకుని పల్లె పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించే అమ్మాయిగా.... చిట్టి బాబుతో రొమాన్స్ సన్నివేశాల్లోను రామ్ చరణ్ కి పోటీగా నటించి ఆకట్టుకుంది. అలాగే సమంత నటించిన మరో మూవీ మహానటి సినిమా వచ్చే నెల తొమ్మిదనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

మరి సమంత ఇప్పుడు ఒకేసారి రెండు సినిమాల్లో ఒకే పాత్ర లో యాక్ట్ చేస్తుంది. అసలు ఇలాంటి అరుదైన ఘటనలు పెద్దగా ఎక్కడా కనిపించవు. కానీ ప్రస్తుతం సమంత విషయంలో అదే జరుగుతుంది. అదేమంటే మహానటి సినిమాలో సావిత్రి పాత్ర ని కీర్తి సురేష్ చేస్తుండగా... అందులోని మధురవాణి పాత్రలో జర్నలిస్ట్ గా కనబడుతుంది సమంత.  ఈ సినిమాలో సమంత 80ల కాలం నాటి జర్నలిస్ట్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా సమంత మధురవాణి లుక్ ని కూడా రివీల్ చేసింది చిత్ర బృందం.

ఇక మహానటి తర్వాత సమంత చేస్తున్న మరో చిత్రం యూ టర్న్. సమంత ఎంతో ఇష్టపడి.. కన్నడ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్న చిత్రమిది. మరి సమంత విచిత్రంగా మహానటి సినిమాలోలా యూ టర్న్ సినిమాలోనూ జర్నలిస్ట్ పాత్ర లోనే కనిపించబోతోంది. ఆ సినిమాలో ఒక ఫ్లై ఓవర్ మీద జరిగిన ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి గురించి రీసెర్చ్ చేసే జర్నలిస్ట్ గా సమంత నటిస్తోంది. అయితే అక్కడ ఆ ప్రమాదం గురించి రీసెర్చ్ చేస్తూ.. ఆఖరికి ప్రమాదంలో పడిపోయే జర్నలిస్ట్ పాత్ర అన్నమాట. మరి అలా సమంత మహానటి సినిమాలో ఆ వెంటనే వచ్చే యూ టర్న్ సినిమాల్లోనూ జర్నలిస్ట్ పాత్ర చేస్తూ ఒక ఘనత సాధించబోతుంది.

Samantha Busy with Back to Back Movies :

Samantha plays Journalist Role in Mahanati and U turn

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ