ఇటీవల మహేష్‌బాబు-కొరటాల శివల కాంబినేషన్‌లో 'శ్రీమంతుడు' చిత్రం తర్వాత వస్తున్న 'భరత్ అనే నేను' చిత్రం వేడుకలను హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో భారీగా జరిపిన సంగతి తెలిసిందే. ఇక ఈ వేడుకకు ముఖ్య అతిధిగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రావడం టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. ఇక ఈ వేడుకకు రామ్‌చరణ్ కూడా రావాలని భావించాడని, కానీ కొన్ని కారణాల వల్ల ఆయన రాలేదని అంటున్నారు. ఇక 'భరత్ అనే నేను' నిర్మాత డి.వి.వి. దానయ్య మహేష్‌తో చిత్రం చేస్తున్నాడు.. నిజానికి దానయ్య ప్రతిస్టార్ హీరోతోనూ మంచి రిలేషన్స్ మెయిన్ టెయిన్ చేస్తూ ఉంటాడు. ప్రస్తుతం డివివి దానయ్య నిర్మాతగానే రామ్‌చరణ్ బోయపాటి శ్రీనుతో చిత్రం చేస్తున్నాడు. దీని తర్వాత ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు కలిసి నటించే 'రాజమౌళి మల్టీస్టారర్'ని కూడా దానయ్యే నిర్మిస్తున్నాడు.
ఇక 'భరత్ అనే నేను'కి ఎవరిని ఆహ్వానించాలి అనే విషయంలో కొరటాలశివ, మహేష్‌బాబుల మధ్య చర్చ నడించిందట. కేవలం తామే ఈ వేడుకను చేస్తే చూసిన మొఖాలనే ఏడాదిగా చూస్తున్నాం... కాబట్టి బోర్‌గా ఫీలవ్వకుండా ఎవరినైనా పిలవాలని మహేష్ కొరటాలకు చెప్పడంతో పాటు యంగ్ టైగర్‌ని పిలిస్తే ఎలా ఉంటుంది? అని మహేష్ కొరటాలతో అన్నాడట. వెంటనే ఎన్టీఆర్‌కి ఫోన్‌చేసి ఈ వేడుక సంగతి చెప్పి రమ్మని అంటే.. ఏం ..జోక్‌లేస్తున్నారా? అన్నాడని, కాదు నిజంగానే రావాలని కోరితే అంగీకరించి తాను కూడా రెండు గంటల పాటు ఎంజాయ్ చేస్తానని చెప్పి వచ్చాడని అన్నాడట. ఇలా ఎన్టీఆర్ 'భరత్ అనేనేను' వేడుకకు రావడం తమకు ఎంతో ప్లస్ అయిందని కొరటాల శివ చెప్పుకొచ్చాడు. ఇక తాజాగా కొరటాల శివపై కూడా కాస్టింగ్‌కౌచ్ ఆరోపణలు రావడం గురించి కొరటాల మాట్లాడుతూ, ఆ విషయం గురించి మరలా మాట్లాడుతాను. ప్రస్తుతం నేను 'భరత్‌అనేనేను' రిలీజ్ బిజీలో, ప్రమోషన్స్ బిజీలో ఉన్నాను. కాబట్టి మరలా స్పందిస్తానని చెప్పాడు.
ఇక తాను రామ్‌చరణ్‌తో సినిమా చేస్తానని, ప్రస్తుతం చరణ్ నటిస్తున్నచిత్రాలు పూర్తయిన తర్వాత ఈ చిత్రం ప్రారంభం అవుతుందని కొరటాల క్లారిటీ ఇచ్చాడు. ఇక ఈ చిత్రాన్ని కనివిని ఎరుగని రీతిలో 'బాహుబలి'కి సరి సమానమైన థియేటర్లలో విడుదల చేస్తున్నారు. రామ్‌చరణ్ 'రంగస్థలం'తో నాన్‌బాహుబలి రికార్డులను తిరగరాస్తే, దానిని సూపర్‌స్టార్ మహేష్‌బాబు చిత్రం అధిగమిస్తుందనే నమ్మకం మహేష్ అభిమానుల్లో కనిపిస్తోంది....!