Advertisementt

సౌండ్‌ ఇంజనీర్‌ మోత బాలీవుడ్‌లో మోగుతుంది!

Mon 16th Apr 2018 12:08 PM
vivek oberoi,bollywood,ram charan,rangasthalam,chittibabu  సౌండ్‌ ఇంజనీర్‌ మోత బాలీవుడ్‌లో మోగుతుంది!
Vivek Oberoi Praises Rangasthalam Chittibabu సౌండ్‌ ఇంజనీర్‌ మోత బాలీవుడ్‌లో మోగుతుంది!
Advertisement
Ads by CJ

తాజాగా రామ్‌చరణ్‌ నటించిన 'రంగస్థలం' చిత్రం అద్భుతమైన రికార్డులను సృష్టిస్తోంది. ఇక ఈ చిత్రం చూసిన పలువురు టాలీవుడ్‌ ప్రముఖులు ఈ చిత్రంపై, రామ్‌చరణ్‌, సుకుమార్‌ వంటి వారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ చిత్రం చూసి జగపతిబాబుకి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నబాలీవుడ్‌ చిత్రంలో చాన్స్‌ వచ్చింది. ఎన్టీఆర్‌ నటించిన 'టెంపర్‌'కి రీమేక్‌గా బాలీవుడ్‌లో రూపొందుతున్న 'సింబా' చిత్రంలో ప్రకాష్‌రాజ్‌ పాత్ర గానీ, లేదా పోసాని కృష్ణమురళి పోషించిన పాత్ర గానీ ఆయనకు వచ్చి ఉంటుందని అంటున్నారు. ఇక మెగా ఫ్యామిలీకి టాలీవుడ్‌లోనే కాదు.. దేశవ్యాప్తంగా అన్ని భాషా చిత్రాల ప్రముఖులలో ప్రత్యేక గౌరవం ఉంది. గతంలో చిరు కూడా రెండు మూడు బాలీవుడ్‌ చిత్రాలు చేశాడు. 

ఇక రామ్‌చరణ్‌ కూడా 'జంజీర్‌' అంటే 'తుఫాన్‌' చిత్రాన్ని బాలీవుడ్‌లో స్ట్రెయిట్‌ మూవీగా తీశాడు. ఇక బాలకృష్ణకి కూడా ఒప్పుకోని అమితాబ్‌ చిరంజీవి ఫ్యామిలీపై ఉన్న అభిమానంతో 'సై..రా' చిత్రంలో కూడా కీలక పాత్రను పోషిస్తున్నాడు. మరోవైపు సల్మాన్‌ఖాన్‌ నుంచి ఎందరితోనో చరణ్‌కి మంచి సాన్నిహిత్యమే ఉంది. ఇక తాజాగా 'రంగస్థలం' చిత్రం గురించి బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబేరాయ్‌ స్పందించాడు. ఆయన చరణ్‌ని అభినందిస్తూ చేసిన ట్వీట్‌ వైరల్‌ అవుతోంది. 'చిట్టిబాబు.... సౌండ్‌ ఇంజనీర్‌....రంగస్థలంతో మంచి విజయం సాధించడం ఎంతో ఆనందంగా ఉంది. మై బ్రదర్‌ రామ్‌చరణ్‌..! నువ్వు 'మెగా' కాంబోకి చెందిన సూపర్‌స్టార్‌వి. సూపర్‌ పర్‌ఫార్మర్‌వి. గాడ్‌ బ్లస్‌ యూ..ఎంతో సంతోషంగా ఉంది. గర్వంగా కూడా ఉంది. అత్యద్భుతమైన యూనిట్‌కి అభినందనలు...!సలాం.. అని ట్వీట్‌చేశాడు. 

అయితే వివేక్‌ ఒబేరాయే ఇలా పొగడ్తల వర్షం కురిపించడానికి ఓ ప్రధాన కారణం కూడా ఉంది. రామ్‌చరణ్‌, బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్న చిత్రంలో వివేక్‌ ఒబేరాయ్‌ విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. దాంతోనే వివేక్‌ రామ్‌చరణ్‌ని అదే పనిగా గుర్తు పెట్టుకుని అభినందించాడని చెప్పవచ్చు. 

Vivek Oberoi Praises Rangasthalam Chittibabu:

Bollywood actor Vivek Oberoi Reaction on Rangasthalam

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ