Advertisementt

ప్రత్యేకహోదాకి ఈ హీరో మద్దతు..!

Sun 15th Apr 2018 08:18 PM
jagapathi babu,politics,ap special status  ప్రత్యేకహోదాకి ఈ హీరో మద్దతు..!
Jagapathi Babu supports AP Special Status ప్రత్యేకహోదాకి ఈ హీరో మద్దతు..!
Advertisement
Ads by CJ

ఇటీవల సురేష్‌బాబుతో సహా ఐదుగురు నిర్మాతలు ఎవ్వరికీ చెప్పా పెట్టకుండా ఏపీసీఎం చంద్రబాబుని కలిసి తెలుగు సినీ పరిశ్రమ ప్రత్యేకహోదా విషయంలో టిడిపి ప్రభుత్వానికి అండగా నిలుస్తామని ప్రకటించారు. దీనిపై పోసాని కృష్ణమురళి, నట్టి కుమార్‌ వంటి వారు మండిపడ్డారు. మాఎవ్వరిని అడగకుండా ఆ..నలుగురు, ఆ ...ఐదుగురు వెళ్లి మేమంతా మీవెంటే ఉన్నాం అని ఎలా చెబుతారు? తెలుగు సినీ పరిశ్రమ కొందరి చేతిలో బందీగా మారి నియంతృత్వ పోకడలు పోతోందని పోసాని, నట్టికుమార్‌లు తీవ్ర విమర్శలు చేశారు.

ఇక పోసాని అయితే తనను అడకుండా తన మద్దతు కూడా ఉంటుందని, తమ మాటగా వారు సీఎం చంద్రబాబుకి హామీ ఇవ్వడం సరికాదని, కాబట్టి తాను ప్రత్యేక హోదాకి మద్దతు ఇవ్వనని చెప్పాడు. ఇక తాజాగా తెలుగుదేశం పార్టీకి చెందిన నిర్మాత, ఎఫ్ డిసి  చైర్మన్‌ అంబికా కృష్ణ కూడా ఎవ్వరితో సంప్రదించకుండా చంద్రబాబు వద్దకు వెళ్లి ఇండస్ట్రీ అంతా ప్రత్యేక హోదాకి సిద్దంగా ఉందని, తెలుగు టీవీ ఆర్టిస్టులు ఢిల్లీలో నిరసన తెలపడానికి, తెలుగు సినీ ప్రముఖులు విజయవాడలో పాదయాత్రకి సిద్దమని తెలిపాడు. 

దీనిపై కూడా పరిశ్రమలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా జగపతిబాబు మాట్లాడుతూ, ప్రత్యేకహోదా ఉద్యమానికి పరిశ్రమ దూరంగా లేదని, అవసరమైనప్పుడు స్పందించడానికి రెడీగా ఉన్నాం. సినిమాలలో ఎలాంటి పాత్రలు చేయడానికైనా సిద్దం. గుండుతో నటించమన్నా నటిస్తాను. ఇక రాజకీయాలలోకి వచ్చే ఉద్దేశ్యం నాకు లేదు. గతంలో కూడా రాజకీయాలలోకి రావాలని పలువురు అడిగిన విషయాన్నిగుర్తు చేశాడు...! 

Jagapathi Babu supports AP Special Status:

I support special status: Jagapathi Babu

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ