ఇంతకాలం అర్బన్ కథలనే తీసి మెప్పించిన సుకుమార్ 'రంగస్థలం'తో గ్రామీణ నేపధ్యంలో సాగే చిత్రాలను కూడా అద్భుతంగా తీయగలనని, అనుకుంటే మాస్ చిత్రాలను, ఊరమాస్ క్యారెక్టర్లతో తన సత్తా చూపించగలనని నిరూపించుకున్నాడు. ఇక 'రంగస్థలం'లోని పాత్రలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయని, దాంతో 'రంగస్థలం 2' కూడా ఉండవచ్చని సంకేతాలు ఇచ్చాడు. అయితే ఈ సీక్వెల్‌లో కేవలం ఆయా పాత్రలు ఉంటాయే గానీ సినిమా కథకు దానికి, దీనికి లింక్ ఉండదని తేల్చాడు. 'రంగస్థలం' కోసం నేను చేసిన హోంవర్క్ వల్ల గ్రామీణ నేపథ్యానికి సంబంధించిన రెండు మూడు చిత్రాలకు కావాల్సిన మెటీరియల్‌ని తయారు చేసుకున్నానని తెలిపాడు. ఇక ఈయన గతంలో 'ఆర్య' విషయంలో కూడా ఇలాగే అనుకుని 'ఆర్య 2' తీసి దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఒకసారి జనాలను విపరీతంగా ఆకర్షించిన చిత్రాలు తదుపరి సీక్వెల్స్‌లో ఆ మ్యాజిక్‌ని రిపీట్ చేయడం కష్టమనే చెప్పాలి.
ఇక సుకుమార్ త్వరలో మైత్రిమూవీమేకర్స్‌లోమహేష్‌తో ఓ చిత్రం చేయనున్నాడని తెలుస్తోంది. ఇక ఈయన చిరంజీవితో కూడా ఓ చిత్రం చేయడం ఖాయమని అంటున్నారు. ఇటీవల సుకుమార్‌ని చిరు ఆనందంతో కౌగిలించుకుని ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. తన వద్ద రెండు మూడు కథలు ఆల్‌రెడీ ఉన్నాయని, ఆ కథలకు ఎవరు సూట్ అవుతారో చూసుకుని అప్పుడు వారిని సంప్రదిస్తానని చెప్పాడు. ఇక ఈయన చిరంజీవితో చిత్రం చేయడం తన కల అని చెప్పాడు. ఇటీవల తాజాగా సుకుమార్ చిరంజీవి వద్దకు వెళ్లి తన వద్ద ఉన్నఓకథను వినిపించాడని తెలుస్తోంది. 'సై..రా...నరసింహారెడ్డి' షూటింగ్ విషయంలో బిజీగా ఉన్నా కూడా చిరు సుకుమార్‌కి సమయం కేటాయించి, కథను విని ఓకే చేశాడని సమాచారం.
ఇక సుకుమార్ ప్రతిభ రామ్‌చరణ్‌ని విపరీతంగా ఆకట్టుకోవడంతో రామ్‌చరణే ఈ చిత్రాన్ని తన కొణిదెల ప్రోడక్షన్స్ బేనర్‌లో 'సైరా' తర్వాత చిరుతో చేస్తాడని, ఇందులో మరో కీలకమైన పాత్ర కూడా ఉండటంతో రవితేజని ఆ ప్రత్యేక కీలకమైన పాత్రకోసం సంప్రదించాడని అంటున్నారు. మొత్తానికి 'సైరా' తర్వాత చిరు సుక్కుతో చేయడం ఖాయమని, రామ్‌చరణ్‌తో 'ధృవ'తో మెప్పించిన సురేందర్‌రెడ్దికి 'సై..రా' అవకాశం ఇచ్చినట్లే, సుక్కుకి కూడా మెగా స్టార్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది.