సుకుమార్ దర్శకత్వంలో రామ్‌చరణ్, సమంత జంటగా వచ్చిన 'రంగస్థలం' చిత్రం పాత ఇండస్ట్రీ రికార్డులను తిరిగి రాస్తోంది. ఇప్పటి వరకు నాన్ బాహుబలి రికార్డుగా ఉన్న తన తండ్రి మెగాస్టార్ 150వ ప్రతిష్టాత్మక చిత్రం 'ఖైదీనెంబర్ 150' చిత్రం కలెక్షన్లను ఈ చిత్రం రెండు వారాలలోనే దాటేసింది. ఇక ఈ చిత్రం గ్రాస్ పరంగా 164కోట్లు, షేర్ పరంగా 103 కోట్లను దాటింది. అయితే నిర్మాతలు ఇంకా ఈ చిత్రం నాన్ బాహుబలి రికార్డులను కొల్లగొట్టిందని ప్రమోషన్ చేయడం లేదు. ఇక ఎంత మంచి చిత్రమైనా వీకెండ్స్‌లో మంచి వసూళ్లు సాధించడం, వీక్‌డేస్‌లో కలెక్షన్లు తగ్గడం మామూలే. కానీ 'రంగస్థలం' మాత్రం వీక్‌డేస్‌లో రెండు వారాలైన తర్వాత కూడా స్టడీ కలెక్షన్లు సాధిస్తుండటంతో ఫుల్‌రన్‌లో ఈ చిత్రం ఎంత వసూళ్లు చేస్తుందో వేచిచూడాల్సి వుంది.
ఇక తాజాగా ఈచిత్రం విజయోత్సవ సభను హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ వద్ద ఉన్నపోలీస్‌పెరేడ్ గ్రౌండ్స్‌లో జరిపారు. ఈ వేడుకకు ముఖ్యఅతిధిగా పవన్‌కళ్యాణ్‌తో పాటు రామ్‌చరణ్, సమంత, జగపతిబాబు, అజయ్‌ఘోష్, నరేష్, పాటల రచయిత చంద్రబోస్, ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌లు హాజరయ్యారు. ఇక ఈ వేడుక సందర్భంగా ఈచిత్రం యూనిట్ ఆడిపాడింది. 'ఒక్క ముద్దు పెట్టవే జిగేల్‌రాణి...కన్నయినా కొట్టవే జిగేల్ రాణి' అనే పాటకు యూనిట్ స్టేజీ మీదనే ఆడిపాడి ఉత్సాహంగా పాల్గొన్నారు అదే సమయంలో రామ్‌చరణ్ కూడా రావడంతో సుకుమార్ ఆయనను కూడా స్టేజీ పైకి వచ్చి ఈపాటకు స్టెప్పులు వేయాలని కోరాడు.
దాంతో రామ్‌చరణ్ సైతం స్టేజీపై ఈపాటలకు చిందులు వేయడంతో ఈ వేడుకకు హాజరైన అందరు చప్పట్లతో మారుమోగేలా చేశారు. ఇక ఈచిత్రం గతరెండు వారాలుగా విడుదలైన 'ఛల్‌మోహన్ రంగ, కృష్ణార్జున యుద్దం' చిత్రాలు పెద్దగా పోటీ ఇవ్వక పోవడంతో 'భరత్‌అనేనేను' విడుదలయ్యే వరకు ఈ చిత్రానికి కలెక్షన్ల పరంగా ఢోకా లేదని అర్ధమవుతోంది...!