Advertisementt

కొరటాల శివ కొత్త వ్యాపారం..!!

Sat 14th Apr 2018 11:22 PM
koratala siva,distribution,director  కొరటాల శివ కొత్త వ్యాపారం..!!
Koratala Siva Enters Distribution Business కొరటాల శివ కొత్త వ్యాపారం..!!
Advertisement
Ads by CJ

మహేష్ - కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం 'భరత్ అనే నేను' ఈనెల 20న భారీ స్థాయిలో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఒక రేంజ్ లో జరిగింది. ఒక్క నైజాం ఏరియా రైట్స్ 22 కోట్లకు అమ్ముడైందంట. శ్రీమంతుడు తర్వాత అదే కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కాబట్టి నైజాం హక్కులు ఆ రేంజ్ లో అమ్ముడైందని తెలుస్తోంది.

అయితే తాజా సమాచారం ప్రకారం నైజాం ఏరియాలో సగం భాగం డిస్ట్రిబ్యూషన్ కొరటాల తీసుకున్నారని ఫిలింనగర్ టాక్. మొదటి నుండి మహేష్ సినిమాలకు నైజాంలో మంచి క్రేజ్ తో పాటు మంచి మార్కెట్ కూడా ఉంది. మహేష్ సినిమాలు అక్కడ మినిమం వసూల్ రాబడుతుంది అని కొరటాల శివ కొంత భాగం డిస్ట్రిబ్యూషన్ ను తీసుకున్నారని అంటున్నారు.

మరో పక్క సినిమా మీద కాంఫిడెన్స్ తో కొరటాల మొదటిసారి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారని వినికిడి. సినిమా టాక్ బాగుంటే వసూల్ మాత్రం ఒక రేంజ్ లో ఉంటాయి అని నమ్ముతున్నారు. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని చిత్ర యూనిట్ తో పాటు కొరటాల కూడా బలంగా నమ్ముతున్నాడు కాబట్టే అయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 

Koratala Siva Enters Distribution Business:

Koratala Siva Eye on distribution 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ