Advertisementt

జాన్విపై కామెంట్ చేసినవారికి క్లాస్ పీకాడు!

Sat 14th Apr 2018 10:25 PM
arjun kapoor,website,sridevi daughter,janhvi kapoor  జాన్విపై కామెంట్ చేసినవారికి క్లాస్ పీకాడు!
​Derogatory remarks on Janhvi Kapoor జాన్విపై కామెంట్ చేసినవారికి క్లాస్ పీకాడు!
Advertisement
Ads by CJ

అతిలోక సుందరి శ్రీదేవి మరణం వరకు బోనీకపూర్‌ మొదటి భార్యకుమారుడు అర్జున్‌కపూర్‌ శ్రీదేవి పేరు కూడా ఎత్తేవాడు కాదు.. ఆయన నాడు ఆ ఫ్యామిలీతో పూర్తిగా సంబంధాలను తెంచుకున్నాడు. ఇక శ్రీదేవి మరణం తర్వాత ఆయన షూటింగ్స్‌ కూడా వాయిదా వేసుకుని, తన తండ్రి, సవతిసోదరీ మణులైన శ్రీదేవి పిల్లలు జాన్వి, ఖుషీలకు అండగా నిలుస్తూ వస్తున్నాడు. ఇక తాజాగా జాన్వి తన సోదరి ఖుషీ, తండ్రి బోనీకపూర్‌తో కలిసి అర్జున్‌ కపూర్‌ ఇంటికి వెళ్లారు. ఆ ఇంటి నుంచి బయటకు వస్తుండగా తీసిన ఫొటోలు ప్రస్తుతం వైరల్‌ అయ్యాయి. ఓ వెబ్‌సైట్‌ ఫొటోలను పెట్టడమే కాదు.. ఆమె వేసుకున్న అభ్యంతరకరమైన డ్రస్ పైన కూడా ఘాటు వ్యాఖ్యలు చేసింది. 

దీంతో అన్నయ్య అర్జున్‌కపూర్‌ కోపంతో ఊగిపోయాడు. ఈ విషయాన్ని హైలైట్‌ చేయడంతోనే మీ వెబ్‌సైట్‌ పరిస్థితి అర్దమవుతోంది. కేవలం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికి మీరు ఎంతకైనా దిగజారుతారు. మీ కళ్లు కేవలం ఆ విషయం మీద, ఆమె డ్రస్‌ మీదనే కేంద్రీకృతమయ్యాయంటే ఇది ఎంత షేమ్‌ ఫుల్లో ఆలోచించండి. మనదేశంలోఆడపిల్లలను చూసేది ఇలాగేనా? వారిని గౌరవించేది ఇలాగేనా? సిగ్గు పడండి.. అని కోపంతో వ్యాఖ్యానించాడు. ఇక సన్నిలియోన్‌ వంటి వారు ఏ డ్రస్‌ వేసినా, ఏ వేషం వేసినా ఎవ్వరూ పట్టించుకోరు. అదే ఓ సావిత్రి, జమున, సౌందర్య వంటి వారు మాత్రం అలా కనిపిస్తే వారిని తమ వారిగా భావించేవారు తట్టుకోలేరు. 

ఇదే విషయం ఇటీవల తనకు అర్ధమైందని, మీడియా తనపై ప్రవర్తించిన తీరుకి నన్ను తన వారిగా చూసుకోవడంతోనే అలా స్పందిస్తున్నారని అనసూయ అభిప్రాయ పడింది. ఇది వాస్తవం కూడా, శ్రీదేవి కూతుర్లు అంటే అందరిలో మన వారు అనే భావన ఉంటుంది. కాబట్టే మీడియా అలా ప్రవర్తించి ఉండవచ్చు అనే కోణంలో కూడా అర్జున్‌కపూర్‌ ఆలోచిస్తే బాగుండేది.

​Derogatory remarks on Janhvi Kapoor:

Arjun Kapoor lashes out at website for making inappropriate comment on Sridevi's daughter Janhvi Kapoor's dress

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ