బాహుబలితో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ తదుపరి సినిమాలో ఎలా కనిపిస్తాడా అనే ఆసక్తితో ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఉన్నాడు. అలాగే బాహుబలితో ఫుల్ క్రేజ్ కొట్టేసిన ప్రభాస్ తదుపరి చిత్రం సాహో మీద భారీగా అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే సాహో నిర్మాతలు ఈ చిత్రాన్ని యూవి క్రియేషన్స్ వారు కళ్ళు చెదిరిపోయే భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. దేశంలోని నాలుగు భాషల్లో తెరకెక్కుతున్న ఈ సాహో చిత్రంపై భారీ క్రేజ్ ఉంది. మరి దర్శకుడు సుజిత్ ఈ చిత్రాన్ని ఎలాంటి కథతో భారీగా తెరకెక్కిస్తున్నాడో తెలియదు గానీ.. ఆ కథ మీద యూవి క్రియేషన్స్ వారికీ ఎంత నమ్మకం లేకపోతే అంతటి బడ్జెట్ పెడతారో అని.
బాహుబలితో విపరీతమైన క్రేజ్, ఫాలోయింగ్ పెంచుకున్న ప్రభాస్ రేంజ్ కి తగ్గట్టుగానే ఈ సినిమా నిర్మితమవుతుంది. అయితే ఈ సినిమాకున్న విపరీతమైన క్రేజ్ కారణంగా బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థలు సాహో చిత్రంపై కన్నేసినట్లుగా తెలుస్తోంది. అలాగే వారు ఎంతటి రేటు పెట్టయినా హిందీ సాహో హక్కులు దక్కించుకోవడానికి రెడీ అవుతున్నారట. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం సాహో చిత్ర హిందీ హక్కులు ఎవరు ఊహించని విధంగా దాదాపు 120 కోట్ల అఫర్ తో అమ్ముడుపోనున్నాయనే టాక్ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
ఇప్పటికే బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ వారితో ఈ మేరకు చర్చలు కూడా జరిపినట్టుగా తెలుస్తోంది. మరి ఈ రేంజ్ లో సాహో హిందీ హక్కులకు డిమాండ్ వచ్చింది అంటే కేవలం ప్రభాస్ కున్న క్రేజ్ మాత్రమే కారణమని తెలుస్తోంది. మరి సాహో మొదలైనప్పటి నుండే భారీ క్రేజ్, భారీ అంచనాలతో ఉన్న ఈ చిత్రానికి అప్పుడే ఈ రేంజ్ లో బిజినెస్ మొదలైంది అంటే... ఇక సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యి బిజినెస్ క్లోజ్ అయ్యేసరికి మరెంతగా బిజినెస్ జరుగుతుందో అంటున్నారు. అసలు ఒక తెలుగు సినిమాకి హిందీలో ఈ రేంజ్ రేటు పలకడంతో సాహో రికార్డు సృష్టించినట్లే మరి.