టాలీవుడ్‌లో కూడా ఆధ్యాత్మిక భావాలు ఉండే వారు చాలా మందే ఉన్నారు. ఇక కోలీవుడ్‌లో రజనీ ఎంతగా స్పిర్చువాలిటీకి విలువ ఇస్తారో తెలిసిందే. ఇక వెంకటేష్ రమణమహర్షి ఫాలోయర్. రజనీకాంత్ ఒకయోగి ఆత్మకథ, బాబా పరమహంస భక్తుడు. అలాగే ఆయనకు రాఘవేంద్రస్వామి అంటే కూడా ఎంతో ఇష్టం. ఇక నాడు మోహన్‌బాబు సాయిబాబాని విపరీతంగా నమ్మేవాడు. ఇక పవన్‌కళ్యాణ్‌లో కూడా ఆధ్యాత్మిక చింతన ఎక్కువే. ఇక ప్రపంచంలోనే ఇటలీలోని వాటికన్ సిటీ తర్వాత అత్యధిక ఆదాయం, భక్తులు సందర్శించుకునే పుణ్యస్థలం శ్రీవేంకటేశ్వస్వామి ఉండే తిరుమల దేవస్థానం. ఇక్కడికి నాటి రేఖా కూడా అమితాబ్‌కి 'కూలీ' చిత్రంలో తీవ్ర గాయాలై ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు అమితాబ్ బతకాలని ఏడుకొండల స్వామిని మోకాళ్లతో ఎక్కి తనలోని ప్రేమను చాటుకుంది.
ఇక రామానాయుడు నుంచి చిరంజీవి, దిల్‌రాజు వంటి ఎందరో వెంకన్న భక్తులే. ఇక విషయానికి వస్తే మెగా కోడలిగా, రామ్‌చరణ్ భార్యగా, మరోవైపు అపోలో బాధ్యతలను చూసుకుంటూనే. అపోలో ఫౌండేషన్ ద్వారా పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తోంది ఉపాసన. మెగా ఫ్యామిలీలో నిత్యం సామాజిక మాధ్యమాలలో బిజీగా ఉంటూ, ఇంట్లో జరిగిన సంఘటనల నుంచి, పలు విశేషాలు, వ్యక్తిగత, రామ్‌చరణ్, చిరంజీవి వంటి వారి సినిమాల అప్‌డేట్స్‌ని అందించడంలో ఈమె చురుకుగా ఉంటుంది. ఇక మెగా ఫ్యామిలీలో రామ్‌చరణ్, ఉపాసన, చిరంజీవి వంటి వారికి కూడా ఆధ్యాత్మిక చింతన ఎక్కువే. పలువురు బాబాలు, స్వాములు చిరంజీవి ఇంటిని సందర్శిస్తూ ఉంటారు. వారి సేవలో వీలున్నప్పుడల్లా మెగా ఫ్యామిలీ పాల్గొంటూ ఉంటారు.
ఇక విషయానికి వస్తే రామ్‌చరణ్ తాజాగా నటించిన 'రంగస్థలం' చిత్రం 'మగధీర' తర్వాత దానిని మించిన హిట్‌గా నిలిచింది. ఆ సంతోషంలో మెగా ఫ్యామిలీ ఉంది. ఇక 'మగధీర' తర్వాత ఆ స్థాయి హిట్ సాధించిన 'రంగస్థలం' విజయవంతంగా నడుస్తుండటంతో ఉపాసన తాజాగా తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరస్వామిని కాలి నడకలో వెళ్లి దర్శించుకుంది. ఈ ఫోటోలను ఆమె ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.