వచ్చే ఎన్నికల్లో పవన్‌కళ్యాణ్ సినీ గ్లామర్ మద్దతు తెలుగుదేశం పార్టీకి దక్కదని అర్ధమైంది. వామపక్షాలతో కలిసి పవన్ సొంత దారిలో నడవాలని అనుకుంటున్నట్లు స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి. ఇక టిడిపికి సినీ గ్లామర్ వచ్చేది కేవలం బాలకృష్ణ వల్లే. కానీ ప్రస్తుత తరుణంలో జూనియర్ ఎన్టీఆర్‌ని కూడా తమ వైపుకు తిప్పుకునే ఆలోచనలో చంద్రబాబు ఉన్నాడని, కానీ జూనియర్ పేరు చెబితేనే బాలయ్య మండిపడుతున్నాడని సమాచారం. ఇటీవల జరిగిన 'ఎన్టీఆర్' బయోపిక్ లాంచ్‌కి కూడా నందమూరి కళ్యాణ్‌రామ్, హరికృష్ణలకు ఆహ్వాన పత్రికలు వెళ్లినా జూనియర్‌కి మాత్రం అది అందలేదని, ఆ విషయం తనకు తెలియదని జూనియర్ ఎన్టీఆరే చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పుడు జూనియర్‌ని, తన తండ్రిని మరలా చంద్రబాబుకు దగ్గర చేసేందుకు నందమూరి కళ్యాణ్‌రామ్ రాజీ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
ఈయన 'ఎన్టీఆర్' వేడుకకు హాజరైన నందమూరి కళ్యాణ్‌రామ్ తాజాగా ఓ హాట్ న్యూస్‌ని బయటపెట్టాడు. చంద్రబాబు నాయుడుపై ఆయన పొగడ్తల వర్షం కురిపించాడు. మామయ్య అంటే నాకు చాలా ఇష్టం. ఆయనెంతో విజన్ ఉన్ననేత. రాష్ట్రం కోసం ఎంతో తపించి పనిచేస్తున్నారు. ప్రజల కోసం నిరంతరం ఆలోచించే వ్యక్తి కాబట్టే ఆయన ప్రజాదరణ ఉన్న నేత అయ్యాడు. తమ అవసరం ఉందని మామయ్య భావిస్తే వచ్చే ఎన్నికల్లో టిడిపి తరపున ప్రచారం చేసేందుకు నాతోపాటు తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ కూడా సిద్దంగా ఉన్నాడని జూనియర్ ఎన్టీఆర్ తరపున తానే హామీ ఇచ్చాడు. మరి ఇలాంటి హామీ జూనియర్ పర్మిషన్ లేకుండా నందమూరి కళ్యాణ్‌రామ్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇక ఇటీవల 'ఎమ్మెల్యే' వేడుకలో పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ, మీ తాత దారిలో నీవు ఎమ్మెల్యే అయితే బాగుంటుంది. నీలాంటి ఎమ్మెల్యేల అవసరం ఉంది అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
ఇక నవ్యాంధ్ర సాధనకు చంద్రబాబు పాలన ఎంతో అవసరం. ఆయన లేకపోతే రాష్ట్రం అంధకారం అయిపోతుంది. ఏపీకి ప్రత్యేక హోదాపై మేము పోరాడేందుకు సిద్దమని కళ్యాణ్‌రామ్ చెప్పాడు. మరి ఇది ఆయన వ్యక్తిగత అభిప్రాయమా? లేక హరికృష్ణ, జూనియర్‌లు అభిప్రాయం కూడానా అనేది తేలాల్సివుంది. ఇక నందమూరి కళ్యాణ్‌రామ్ మాట్లాడుతూ, శ్రీరెడ్డి చెప్పినట్లు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ జరుగుతున్నట్లు నేను భావించడం లేదు. అయినా ప్రస్తుతం నేనే నా పనుల్లో బిజీగా ఉన్నాను. ఇతరుల గురించి ఆలోచించే సమయం లేదని చెప్పాడు. శ్రీరెడ్డి విషయంలో స్టార్స్ అందరు మౌనం పాటిస్తూ, సమాజానికి ఏమి సందేశం ఇస్తున్నారని శ్రీరెడ్డి అందుకే వ్యాఖ్యానించిందని అర్ధం చేసుకోవాలి...!