Advertisementt

భరత్ అనే నేను కాపీ అంటున్నారు..!

Sat 14th Apr 2018 12:28 PM
mahesh babu,bharat ane nenu,rana,leader,cm,copy  భరత్ అనే నేను కాపీ అంటున్నారు..!
Mahesh's Bharat Ane Nenu Story Leaked: భరత్ అనే నేను కాపీ అంటున్నారు..!
Advertisement
Ads by CJ

కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన భరత్ అనే నేను సినిమా మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేక్షకుల్లోనూ ట్రేడ్ వర్గాల్లోనూ భారీ అంచనాలున్న భరత్ అనే నేను ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి. అయితే ఈ సినిమా కథని కొరటాల శివ ప్రస్తుతం రాజకీయాల్లో హైలెట్ గా నిలుస్తున్న స్టార్ హీరో పవన్ కళ్యాణ్ ని స్ఫూర్తిగా తీసుకుని రాశాడని టాక్ వుంది. అది నిజమే అని కూడా అంటారు. అలాగే ఎంతగా పవన్ ని స్ఫూర్తిగా తీసుకున్న.. కొరటాల ఆ కథను తన శైలిలో రాసుకుని మెరుగులు దిద్దడం కూడా వాస్తవం అంటున్నారు. అయితే ఎంతగా కొరటాల పవన్ కళ్యాణ్ ని స్ఫూర్తిగా తీసుకుని రాసుకున్న... ఇప్పుడు కొరటాల భరత్ అనే నేను కథను ఒక తెలుగు సినిమాకి కాపీగా తీశాడని టాక్ వినబడుతుంది.

అది కూడా తాజాగా వచ్చిన శేఖర్ కమ్ముల - రానాల లీడర్ సినిమా. భరత్ అనే నేను సినిమాలో మహేష్ సీఎం పాత్రలో కనిపిస్తాడు. అలాగే రానా కూడా లీడర్ లో సీఎంగా కనిపిస్తాడు. తన తండ్రి చనిపోతే వారసత్వంగా సీఎం పదవి కోసం అడ్డదారులు తొక్కి మరి... రానా సీఎం గా రాజకీయాలను ప్రక్షాళన చెయ్యాలని కంకణం కట్టుకుని ఉన్నప్పటికీ... రాజకీయాలలో జరిగే సంక్షభంతో అనుకోని పరిస్థితుల్లో తన సీఎం పదవిని కాపాడుకోవడం కోసం చివరికి రానా సీఎం గా కూడా కరెప్ట్ అవడానికి సిద్ధపడతాడు. అయితే ఇప్పుడు భరత్ అనే నేను సినిమా థీమ్ కూడా లీడర్ తరహాలోనే సాగుతుందట. లీడర్ లో లాగా సేమ్ భరత్ లో కూడా తన తండ్రి చనిపోతే తల్లి కోరిక మేరకు మహేష్ సీఎం అవతారమెత్తడమే కాదు... రాజకీయాలను ప్రక్షాళన చేసి.... సీఎం గా తానేమిటో నిరూపించుకునే క్రమంలో జరిగే ఘటనలు కొరటాల తన స్టయిల్లో తెరకెక్కించినట్లుగా ప్రచారం జరుగుతుంది.

అందుకే సోషల్ మీడియాలో రానా లీడర్ సినిమాకి మహేష్ బాబు భరత్ అనే నేను సినిమాకి పోలిక పెట్టి ప్రచారం చేస్తున్నారు. అయితే సినిమా చూసేవరకు భరత్ అనే నేను, లీడర్ సినిమాని కాపీ చేశారా లేదా అని చెప్పడం మాత్రం కరెక్ట్ కాదంటున్నారు. చూద్దాం భరత్ కి లీడర్ కి ఏ మేర పోలికలున్నాయి అనేది మరో వారంలోనే తెలిసిపోతోంది. 

Mahesh's Bharat Ane Nenu Story Leaked::

Mahesh's Bharat Ane Nenu Story Similarities with Leader!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ