Advertisementt

తమన్నాకి గర్వంగా ఉందట..!

Sat 14th Apr 2018 01:37 AM
tamanna,dadasaheb phalke excellence award 2018  తమన్నాకి గర్వంగా ఉందట..!
Tamanna Bhatia to Receive Dadasaheb Phalke Award తమన్నాకి గర్వంగా ఉందట..!
Advertisement
Ads by CJ

దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డును అందుకోవడం సినీ పరిశ్రమలో అత్యంత అరుదైన గౌరవంగా భావిస్తారు. ఇక ఇది పొందే అర్హుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో పోటీ తీవ్రంగా ఉంటోంది. ఇదే సమయంలో దాదాసాహెబ్‌ఫాల్కే ఫౌండేషన్‌ ఈతరం నటీనటుల కోసం దాదాసాహెబ్‌ ఫాల్కే ఎక్స్‌లెన్సీ అవార్డును ప్రకటిస్తోంది. ఈ నిర్ణయం బహుదా ప్రశంసలు అందుకుంటోంది. ఇక ఈ అవార్డుకు ఇప్పటికే అనుష్కశర్మ, రణవీర్‌సింగ్‌లను ఎంపికచేశారు. ఇక తాజాగా ఈ అవార్డును మరో నటికి ప్రకటించారు. ఆమెఎవరో కాదు.. దక్షిణాది భాషల్లోనే గాక బాలీవుడ్‌లో కూడా కొన్ని చిత్రాలలో నటించిన తమన్నా భాటియా. 

ఇక ఈమె 'బాహుబలి-ది బిగినింగ్‌'లో అవంతిక పాత్ర ద్వారా దేశ ప్రజలకే కాదు.. ఈ చిత్రం విడుదలైన అన్ని దేశాలలోగుర్తింపును తెచ్చుకుంది. ఈ అవార్డుని తనకు ఇవ్వడం పట్ల ఎంతో సంతోషంగా గర్వంగా ఉందని తమన్నా చెప్పుకొచ్చింది. ఈనెల 21 వతేదీన ముంబైలోజరిగే వేడుకలో ఈ అవార్డును అనుష్కశర్మ, రణవీర్‌సింగ్‌లతో పాటు తమన్నా అందుకోనుంది. ఇక తమన్నా ప్రస్తుతం కూడా తన ఉనికిని చాటుకుంటూనే ఉంది. వెంకటేష్‌-తేజల 'ఆటా నాదే వేటా నాదే'లోకూడా ఈమెని తీసుకోనున్నారని, అలాగే వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌లు హీరోలుగా నటించనున్న 'ఎఫ్‌2' ఫన్‌అండ్‌ ఫస్ట్రేషన్‌లో కూడా వెంకీ సరసన ఈమెని పరిశీలిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

ఇక ఈమె ఇప్పుడు తెలుగులో బాలీవుడ్‌ 'క్వీన్‌'కి రీమేక్‌గా తీస్తున్న చిత్రంతో పాటు నందమూరి కళ్యాణ్‌రామ్‌ సరసన 'నానువ్వే' చిత్రంలో కూడా నటిస్తోంది. 'నా నువ్వే' చిత్రం మే లేదా జూన్‌ మొదటి వారంలో విడుదలకానుండగా, 'క్వీన్‌' రీమేక్‌ గురించి మాత్రం ఏమాత్రం అప్‌డేట్స్‌ తెలియడం లేదు.

Tamanna Bhatia to Receive Dadasaheb Phalke Award:

Dadasaheb Phalke Excellence Award 2018: Tamannaah Bhatia to be honoured for her role in 'Baahubali: The Beginning'

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ